Tasty Teja : వేలంపాటలో వినాయకుడి లడ్డు దక్కించుకొని ఊరంతా ఊరేగింపు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..
ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ వినాయకుడి లడ్డుని వేలంపాటలో దక్కించుకున్నాడు.
- By News Desk Published Date - 03:37 PM, Tue - 17 September 24

Tasty Teja : ప్రస్తుతం దేశమంతా వినాయక నిమజ్జనం హంగామా , వినాయకుడి లడ్డు వేలంపాటలు జరుగుతున్నాయి. వేల నుంచి మొదలుకొని కోట్ల రూపాయల వరకు వినాయకుడి లడ్డూ ప్రసాదాలు వేలంపాటలో దక్కించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలో బిగ్ బాస్ 7 కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ కూడా వినాయకుడి లడ్డుని వేలంపాటలో దక్కించుకున్నాడు.
ఈ విషయాన్ని టేస్టీ తేజ తన సోషల్ మీడియాలో తెలియచేసాడు. టేస్టీ తేజ తలపై వేలంపాటలో తను దక్కించుకున్న లడ్డుని పెట్టుకొని ఊరంతా ఊరేగింపు చేసిన వీడియోని షేర్ చేసాడు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. మా ఊళ్ళో 25 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నారు. ఈ సారి 25వ సంవత్సరం కావడంతో 25 కేజీల లడ్డు పెట్టారు. దాన్ని వేలంపాటలో నేను దక్కించుకున్నాను అని తెలిపాడు.
టేస్టీ తేజది తెనాలి దగ్గర్లోని చినపరిమి అనే గ్రామం. ఆ గ్రామంలో ఇప్పుడు వేలంపాటలో వినాయకుడి లడ్డుని గెలుచుకొని ఊరంతా ఊరేగింపు చేసాడు తేజ. ఈ ఊరేగింపులో డ్యాన్సులు వేసి సందడి చేసాడు. అయితే ఈ లడ్డుని 75000 రూపాయలకు తేజ గెలుచుకున్నట్టు సమాచారం.
Also Read : Jani Master : జానీ మాస్టర్ ఇష్యూ ఫై పూనమ్ రియాక్షన్…