Bigg Boss 7 : రతిక మారలేదు.. ఆమె నామినేషన్ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్..!
Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ చెప్పిన నాగ్ నిజంగానే ఈ సీజన్ మొత్తం ఉల్టా పుల్టా చేస్తున్నాడు. హౌస్ లో ఆమె అతి చూడలేక బయటకు
- By Ramesh Published Date - 11:07 AM, Fri - 27 October 23

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ చెప్పిన నాగ్ నిజంగానే ఈ సీజన్ మొత్తం ఉల్టా పుల్టా చేస్తున్నాడు. హౌస్ లో ఆమె అతి చూడలేక బయటకు పంపించిన రతికని మళ్లీ ఉల్టా పుల్టా అని చెప్పి రీ ఎంట్రీ ఇప్పించాడు. బయట ఎవరి ఆట ఏంటని చూసిన రతిక స్టార్ మా బ్యాచ్ కి దూరంగా జరిగి శివాజి, యావర్ లతో క్లోజ్ గా ఉంటుంది. అంతేకాదు పల్లవి ప్రశాంత్ తో కూడా క్లోజ్ అవ్వాలని చూస్తుంది. కానీ అది వర్క్ అవుట్ అవ్వట్లేదు.
తన ఎలిమినేషన్ కి పల్లవి ప్రశాంత్ ని తను ఏడిపించడమే కారణమని ఫిక్స్ అయిన రతిక అతనికి దగ్గర అవ్వాలని చూస్తుంది. కానీ పల్లవి ప్రశాంత్ రతికని దూరం పెడుతున్నాడు. నిన్న ఎపిసోడ్ లో తనని అక్క అని పిలవాల్సిన అవసరం లేదని కూడా అన్నది రతిక. కానీ ప్రశాంత్ లేదు నేను అక్కా అనే పిలుస్తా అని అన్నాడు.
మధ్యలో శివాజి కలుగచేసుకుని అక్క అని అనకులే అని అన్నాడు. ఆట చూసొచ్చి బయట ఎవరికి ఆడియన్స్ ఫేవర్ గా ఉన్నారో వాళ్లతో క్లోజ్ గా ఉంటున్న రతిక గేం ప్లాన్ ని ఆడియన్స్ అర్ధం చేసుకోలేరా చెప్పండి. రతిక మళ్లీ ఈ డబుల్ గేం ఆడటం చూస్తే ఆమె మళ్లీ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అర్ధమవుతుంది. రతిక మాటలతో కాకుండా టాస్కుల్లో పర్ఫార్మ్ చేసి ఆడియన్స్ మనసులు గెలిస్తే బెటర్.
Also Read : Megastar Chiranjeevi Maruthi : మారుతికి మెగాస్టార్ ఛాన్స్ ఇస్తాడా..?