Bigg Boss 7 : ఫ్రెండ్ కోసం అమర్ రిస్క్.. కొత్త కెప్టెన్ ఎవరంటే..!
Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ ముగుస్తుందని తెలిసిందే. ఈ వారం కెప్టెసీ టాస్క్ లో భాగంగా హౌస్ మెట్స్ ని రెండు టీం లుగా విడగొట్టిన
- By Ramesh Published Date - 07:08 PM, Fri - 3 November 23

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ ముగుస్తుందని తెలిసిందే. ఈ వారం కెప్టెసీ టాస్క్ లో భాగంగా హౌస్ మెట్స్ ని రెండు టీం లుగా విడగొట్టిన బిగ్ బాస్ రకరకాల టాస్క్ లు ఇచ్చి కెప్టెసీ కంటెండర్స్ గా ఒక టీంని ఎంపిక చేశాడు. అయితే ఈ టీం లో ఎవరు కెప్టెన్ అయ్యేది అన్నది అవతల టీం టాస్క్ ఆడి గెలవాలని చెబుతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కరికి సపోర్ట్ గా ఉంటూ ఆట ఆడాల్సి ఉంది. ఈ టాస్క్ లో శివాజి, అమర్ దీప్ (Amardeep), ప్రియాంక, అశ్విని, బోలే శావలి (Bole Shavali) ఆడారు.
వీరిలో అమర్ దీప్ మొదటిసారి అగ్రెసివ్ గా టాస్క్ ఆడి మిగతా వారిని ఓడించాడు. ఫైనల్ గా ప్రియాంకాతో కూడా పోటీ పడి మరి టాస్క్ విన్నర్ అయ్యాడు. అయితే అమర్ తీసుకుంది శోభా శెట్టి (Shobha Shetty) బ్యాగ్ కాబట్టి ఈసారి కెప్టెన్ గా శోభా గెలిచింది. తమ కెప్టెన్సీ కోసం కాకుండా అవతల టీం కెప్టెన్ గా గెలిచేందుకు వీరు ఆడాల్సి వచ్చింది.
మొత్తానికి శోభా ఇంటి కెప్టెన్ అయ్యింది. ఈ వారం ఆమె నామినేషన్స్ లో ఉంది. కెప్టెన్ అయ్యింది కదా మరి ఎలిమినేషన్ (Elimination) నుంచి తప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఈ వారం ఎనిమిది మంది హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉండగా వారిలో శోభా, రతిక, తేజానే రిస్క్ లో ఉన్నట్టు తెలుస్తుంది. శోభా కెప్టెన్ అయ్యింది కాబట్టి ఈ వారం సేఫ్ అయితే నెక్స్ట్ వీక్ కూడా ఆమె ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటుంది.
Also Read : Bharateeyudu 2 : భారతీయుడు 2 వచ్చేశాడు.. ఇంట్రో టీజర్ తోనే అదరగొట్టేశారు..!
We’re now on WhatsApp : Click to Join