Bigg Boss 19 Contestant : బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ ఫోటో షూట్..అరేయ్ ఏంట్రా ఇది !!
Bigg boss 19 Contestant : సౌందౌస్ మౌఫకీర్ ఫతే, ఖతాల్, నాటీ బల్మా వంటి హిందీ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. తన గ్లామర్‌తో ఫ్యాషన్ ప్రపంచంలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న
- By Sudheer Published Date - 05:11 PM, Tue - 15 July 25

సోషల్ మీడియాలో (Social Media) సొంత గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో తారలు కొత్తకొత్త ప్రయోగాలు చేస్తుండటం కొత్తేమీ కాదు. ఈ కోవలోనే ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ సౌందౌస్ మౌఫకీర్(Soundous Moufakir) పేరు తెగ చర్చలో ఉంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోషూట్‌తో ఆమె నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చీరకట్టుతోనే కనిపించినా బ్లౌజ్ లేకుండా మల్లెపూలను మాత్రమే అడ్డుపెట్టి స్టన్నింగ్ లుక్‌తో అందాలను ఆరబోసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతూ, కొంతమంది ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు.
IndiGo : ‘మాన్‌సూన్ సేల్’ను ప్రకటించింన ఇండిగో..రూ.1,499 ధరకే విమాన ప్రయాణం
బిగ్ బాస్ 19 సీజన్(Bigg boss 19 contestant)కు కంటెస్టెంట్‌గా సౌందౌస్ మౌఫకీర్ పేరు బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆమె చేసిన ఈ గ్లామర్ షో మరింతగా హాట్ టాపిక్ అయింది. బిగ్ బాస్‌లో ఎంటర్ కాకముందే సోషల్ మీడియాలో తన హైప్ పెంచుకోవాలని ఈ ఫోటోషూట్ చేయించినట్లు భావిస్తున్నారు. నుదుటిపై బొట్టు, మెడలో భారీ నగలు, గోరింటాకు, చీరకట్టుతో భారతీయతను చూపించినా, అదే సమయంలో బ్లౌజ్ లేకుండా మల్లెపూలతో హాట్‌నెస్‌ను జోడించి ఫ్యూజన్ లుక్‌ను అందించింది.
సౌందౌస్ మౌఫకీర్ ఫతే, ఖతాల్, నాటీ బల్మా వంటి హిందీ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. తన గ్లామర్‌తో ఫ్యాషన్ ప్రపంచంలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ వేదికపైకి ఎంటర్ కావడానికి సిద్ధమవుతోంది. బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందే ఇలా ట్రెండ్ సెట్ చేయడం ద్వారా తన బ్రాండ్ విలువను పెంచే ప్రయత్నం చేస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు.