Balakrishna : భగవంత్ కేసరి ఆ సీక్రెట్ దాచేసిన టీం..!
Balakrishna నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో అనీల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. దసరా కానుకగా ఈ నెల 19న సినిమా రిలీజ్
- By Ramesh Published Date - 08:59 PM, Mon - 16 October 23

Balakrishna నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో అనీల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. దసరా కానుకగా ఈ నెల 19న సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీ లీల (Sri Leela) ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
పటాస్ నుంచి ఎఫ్3 వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి బాలకృష్ణతో మొదటిసారి సినిమా చేశారు. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో అనీల్ రావిపుడి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో సినిమా ముఖ్యంగా నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుందని అన్నారు. సినిమాలో బాలయ్య మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారని. ట్రైలర్ ప్రచార చిత్రాల్లో రెండు షేడ్స్ చూపించామని 3వ రోల్ రివీల్ చేయలేదని అన్నారు.
అది థియేటర్ లో చూసి సర్ ప్రైజ్ అవుతారని అంటున్నారు అనీల్ రావిపుడి (Anil Ravipudi). సంక్రాంతికి వీర సింహా రెడ్డి అంటూ వచ్చి హిట్ అందుకున్న బాలకృష్ణ దసరాకి భగవంత్ కేసరి (Bhagavanth Kesari) అంటూ రాబోతున్నారు. ఈ సినిమా విషయంలో యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అఖండ వీర సింహా రెడ్డి రెండు వరుస హిట్లతో దూసుకెళ్తున్న బాలకృష్ణ భగవంత్ కేసరితో హ్యాట్రిక్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. అనీల్ మార్క్ కామెడీతో పాటుగా బాలకృష్ణ మార్క్ మాస్ సినిమాగా భగవంత్ కేసరి వస్తుంది.
Also Read : Ravi Teja: రవితేజ టైగర్ నాగేశ్వర రావు మేకింగ్ వీడియో చూశారా