Bhagavanth Kesari Collections : రెండు రోజుల్లోనే రూ.50 క్రాస్ చేసిన భగవంత్ కేసరి
రానున్న రెండు, మూడు రోజులు కూడా వీకెండ్, పండగ సెలవులు కావడంతో కేసరి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది
- By Sudheer Published Date - 01:36 PM, Sat - 21 October 23

బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. నందమూరి బాలకృష్ణ (Balakrishna), శ్రీలీల (Sreeleela), కాజల్ (Kajal) ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ భగవంత్ కేసరి (Bhagavanth Kesari). అఖండ , వీర సింహ రెడ్డి హిట్స్ తర్వాత బాలకృష్ణ నుండి వస్తున్న సినిమా కావడం..వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి డైరెక్టర్ అవ్వడం..ముఖ్యంగా యూత్ కలల రాణి శ్రీ లీల బాలకృష్ణ కు కూతురుగా నటించడం తో సినిమా ఫై అంచనాలు పెరిగాయి.
ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా తెరకెక్కడం తో అభిమానులతో పాటు ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టగా.. రెండవ రోజు రూ.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కేవలం రెండు రోజుల్లోనే హాఫ్ సెంచరీ దాటేసి రూ .51.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు.
రానున్న రెండు, మూడు రోజులు కూడా వీకెండ్, పండగ సెలవులు కావడంతో కేసరి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. భగవంత్ కేసరి సినిమాతో మరో వంద కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోనున్నారు బాలయ్య. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వంద కోట్ల కొల్లగొట్టిన బాలయ్య.. వరుసగా మూడోసారి ఆ ఫీట్ ను సాదించనున్నాడని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Read Also : Neckzilla : కండలు తిరిగిన మెడ.. బాడీబిల్డర్ ఫొటోలు వైరల్