Samantha Skips: నయన్ పెళ్లికి సమంత డుమ్మా.. ఎందుకో తెలుసా!
కోలివుడ్ జంట నయనతార, విఘ్నేష్ శివన్ అధికారికంగా పెళ్లి చేసుకున్నారు.
- By Balu J Published Date - 05:49 PM, Thu - 9 June 22

కోలివుడ్ జంట నయనతార, విఘ్నేష్ శివన్ అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఇయర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెళ్లిళ్ల ఇదొకటి. అతికొద్దమంది అతిథుల మధ్య పెళ్లి చేసుకుంది ఈ జంట. ఈ వేడుకకు ఇండస్ట్రీ నుండి చాలా మంది పెద్దలు హాజరు కాగా, అత్యంత సన్నిహితులలో ఒకరు. టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు అటెండ్ కాకపోవడంతో చర్చనీయాంశమవుతోంది. అయితే వరుస షూటింగ్స్ బిజీగా ఉండటంతో పెళ్లికి హాజరుకావడం లేదని తెలుస్తోంది.“కత్తువాకుల రెండు కాదల్ షూటింగ్ సమయంలో నయనతార తో క్లోజ్ గా మూవ్ అయ్యింది. నయన్ పెళ్లి కోసం సమంత ఫుల్ ఎగ్జైట్ గా ఉంది. విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘ఖుషి’ రెండో షెడ్యూల్ షూటింగ్‌లో ఉన్నందున ఆమె పెళ్లికి హాజరుకాలేకపోయింది.