Bandla Ganesh : బండ్ల గణేష్ ఫై అయ్యప్ప భక్తులు ఆగ్రహం..
అయ్యప్ప దీక్షలో ఉండి బండ్ల గణేష్ ఇలా కాలికి చెప్పులు వేసుకున్నాడేంటి? అని భక్తులు, జనాలు ఆశ్చర్యపోతు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
- Author : Sudheer
Date : 14-11-2023 - 1:28 IST
Published By : Hashtagu Telugu Desk
బండ్ల గణేష్ (Bandla Ganesh)..ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్రసీమలో అడుగుపెట్టిన గణేష్..ఆ తర్వాత బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా అతి తక్కువ టైంలో పేరు తెచ్చుకొని వార్తల్లో నిలిచారు. కేవలం సినిమాల పరంగానే కాదు రాజకీయాలతోను నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ ఇస్తూ వస్తున్న ఈయన..తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బండ్ల గణేష్ ప్రతీ ఏటా దీపావళి (Diwali Celebrations) ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటాడు. దానికి సంబదించిన స్పెషల్ ఫోటోను షేర్ చేస్తుంటాడు. ఊరందరికీ సరిపడా క్రాకర్స్‌ను తన ఇంటికి తీసుకొచ్చి.. వాటిని ఇంటి ముందు పేర్చి ఓ ఫోటోను నెట్టింట్లో వదులుతాడు. లక్షల విలువైన ఆ క్రాకర్స్‌తో బండ్ల గణేష్ దీపావళి పండుగను సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఈ సారి కూడా అలాగే చేసాడు. కానీ ఆయన చేసిన పిక్ ఇప్పుడు ఆయన్ను వివాదంలోకి నెట్టింది. ప్రస్తుతం గణేష్ అయ్యప్ప మాల (Ayyappa Deeksha)లో ఉన్నారు.
అయ్యప్ప దీక్షలో ఉండి బండ్ల గణేష్ ఇలా కాలికి చెప్పులు (Slippers ) వేసుకున్నాడేంటి? అని భక్తులు, జనాలు ఆశ్చర్యపోతు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్దలతో ఉండాల్సిన మాలలో ఇలా చెప్పులు వేసుకోవడం ఏంటి అని వారంతా మండిపడుతున్నారు. అయ్యప్ప మాల చాలా పవిత్రమైనది. దాన్ని ఇలా చేసి అపవిత్రం చేయకండి.. మాలాధారణలో ఉంది ఇలా చేయడం తప్పు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పై బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారు చూడాలి.
Read Also : Vennela Kishore: ‘చారి 111’గా ‘వెన్నెల’ కిశోర్ ఫస్ట్ లుక్, స్పై యాక్షన్ కామెడీలో స్టైలిష్ లుక్