Balakrishna : బాలయ్య గోపీచంద్ మళ్లీ రెడీ..!
Balakrishna బాలకృష్ణ తను తీసిన డైరెక్టర్స్ తోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని చూస్తున్నాడు. బాబీ తో డాకు మహారాజ్ సక్సెస్ అందించింది కాబట్టి అతనితో కూడా బాలయ్య మరో సినిమాకు రెడీ
- By Ramesh Published Date - 11:54 PM, Mon - 3 February 25

Balakrishna : నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సూపర్ జోష్ లో ఉన్నాడు. ఆయన తీస్తున్న సినిమాలు ఫ్యాన్స్ కి బాగా నచ్చేస్తున్నాయి. అందుకే హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. రీసెంట్ గా డాకు మహారాజ్ తో బాలయ్య బాబు మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో అఖండ 2 సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. అఖండ సీక్వెల్ గా అఖండ 2 నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమా తో పాటు లేటెస్ట్ గా గోపీచంద్ మలినేని సినిమా కూడా దాదాపుగా కన్ ఫర్మ్ అంటున్నారు. బాలయ్య అఖండ 2 అలా రిలీజ్ అవ్వడం ఆలస్యం వెంటనే గోపీచన్ సినిమాకు లైన్ క్లియర్ చేస్తాడని తెలుస్తుంది. వీర సిం హా రెడ్డితో ఈ కాంబో హిట్ అందుకోగా ఈసారి ఆ సినిమాకు మించే కథతో గోపీచంద్ రాబోతున్నాడని తెలుస్తుంది.
బాలకృష్ణ తను తీసిన డైరెక్టర్స్ తోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని చూస్తున్నాడు. బాబీ తో డాకు మహారాజ్ సక్సెస్ అందించింది కాబట్టి అతనితో కూడా బాలయ్య మరో సినిమాకు రెడీ అంటున్నాడని టాక్. గోపీచంద్ సినిమా తర్వాత మళ్లీ బాబీతో బాలయ్య సినిమా ఉండబోతుంది. సో తనతో సినిమా చేసిన డైరెక్టర్స్ ని తన ఫ్యాన్స్ గా చేసుకుని అదరగొట్టేస్తున్నాడు బాలకృష్ణ. ఈమధ్యనే ఒక షోలో ఇక మీదట రాబోయే సినిమాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని బాలకృష్ణ చెప్పడం క్రేజీగా మారింది..