Balakrishna : షూటింగ్లకు బాలకృష్ణ బ్రేక్..?
- By Sudheer Published Date - 11:08 AM, Fri - 16 February 24

వరుస సక్సెస్ లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ (Balakrishna)..కొద్దీ నెలల పాటు సినిమా షూటింగ్ లకు బ్రేక్ (Break) ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కు మూడు నెలల పాటు బ్రేక్ ఇవ్వబోతున్నాడట. దీనికి కారణం ఏపీ ఎలెక్షన్లే.
మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు (AP Elections) జరగబోతున్నాయి. ఈసారి ఏపీలో ఎన్నికలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టిడిపి..ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని కసిగా ఉంది. ఇప్పటికే జనసేన తో పొత్తు పెట్టుకోగా…ఇక బిజెపి ని కూడా తమ జట్టులో కలుపుకోబోతుంది. ఇలా మూడు పార్టీలు కలిసి జగన్ ఫై యుద్ధం చేయబోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెటగా..పవన్ కళ్యాణ్ సైతం అతి త్వరలో మొదలుపెట్టనున్నారు. ఇక బాలకృష్ణ సైతం పార్టీ గెలుపు కోసం రంగంలోకి దిగబోతున్నాడు. ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే గా బాధ్యత చేస్తూనే..మరోపక్క సినిమాలతో అలరిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో సినిమాలు పక్కకు పెట్టి ఈ రెండు నెలల్లో ప్రజల్లో ఉండేలా చూసుకుంటున్నాడు. టిడిపి ని గెలిపించే బాధ్యత తనపై కూడా ఉండడం తో ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదే విషయాన్నీ మూవీ మేకర్స్ తో కూడా చెప్పాడట. మూడు నెలల పాటు రాజకీయాలతో బిజీ గా ఉంటానని..ఆ తర్వాత షూటింగ్ లో పాల్గొంటానని చెప్పాడట.
బాబీ దర్శకత్వంలో బాలయ్య తన 109వ సినిమాను చేస్తున్నాడు. ఇక ఈ సినిమా NBK109 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. బాబీ గత ఏడాది చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్టను అందుకున్నాడు. ఇప్పుడు బాలయ్యతో హిట్ కొట్టేందుకు రెడీ గా ఉన్నాడు.
Read Also : Medaram Jatara:ఇక పై మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు