Akhanda 2 Mokshagna Entry : అఖండ 2 మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా..?
అఖండ 2 సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అఖండ సినిమా డబ్బింగ్ వెర్షన్ హిందీలో భారీ వ్యూస్
- By Ramesh Published Date - 04:56 PM, Tue - 9 July 24

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సూపర్ హిట్ సినిమా అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. డిసెంబర్ నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ ఉంటుందని లేటెస్ట్ టాక్. నందమూరి నట వారసుడి కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫారిన్ లో యాక్టింగ్ కోర్స్ తీసుకున్న మోక్షజ్ఞ తన తొలి సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తుంది.
ఐతే సోలో సినిమాకు ముందే బాలయ్య తన సినిమాలో ఒక సర్ ప్రైజింగ్ రోల్ లో మోక్షజ్ఞని తీసుకుంటున్నారట. సినిమా హైలెట్ గా చెప్పుకునే అంశాల్లో ఇది ఒకటని. కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ కి ఇది మాస్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. మోక్షజ్ఞ కూడా అఖండ 2 (Akhanda 2) లో తన పాత్ర కోసం సంసిద్ధం అవుతున్నాడని అంటున్నారు.
అదే జరిగితే మాత్రం అఖండ 2 నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. అఖండ 2 సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అఖండ సినిమా డబ్బింగ్ వెర్షన్ హిందీలో భారీ వ్యూస్ రాబట్టింది. అందుకే అఖండ 2 ని నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా పాన్ ఇండియా (PAN India) వైడ్ గా స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.
ఇక మోక్షజ్ఞ సోలో సినిమాను అటు పూరీతో కానీ క్రిష్ డైరెక్షన్ లో కానీ చేయించే ఆలోచనలో ఉన్నాడు బాలకృష్ణ. తొలి సినిమా ఎవరి డైరెక్షన్ లో అయినా మాస్ క్లాస్ ఆడియన్స్ అందరినీ ఎట్రాక్ట్ చేసేలా అదిరిపోయే కథ సెట్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క.
Also Read : Kajal Agarwal : కాజల్ కి కలిసి రావట్లేదు..!