Bigg Boss 6: గీతూ బాలాదిత్యా మద్య మాటల యుద్ధం.. మాట జారుతున్నావు గీతు అంటూ?
బిగ్ బాస్ సీజన్ 6 లో తాజాగా గలటా గీతూ మరొకసారి రెచ్చిపోయింది. మంచికి చెప్పినా కూడా వినకుండా సమాధానాలు
- By Nakshatra Published Date - 03:23 PM, Fri - 28 October 22
బిగ్ బాస్ సీజన్ 6 లో తాజాగా గలటా గీతూ మరొకసారి రెచ్చిపోయింది. మంచికి చెప్పినా కూడా వినకుండా సమాధానాలు చెబుతూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది. తాజాగా బిగ్ బాస్ ప్రోమో నీ విడుదల చేశారు. ఆ ప్రోమోలో గీతూ మరొకసారి రెచ్చిపోయింది. బాలా దీక్ష పై కక్ష కట్టిన గీతూ అతనితో వాదనకు దిగింది. కిచెన్ టీం లో ఉన్న గీతూ కూరగాయలు కట్ చేసి ఆ చెత్తను అక్కడే వదిలేయడంతో వెంటనే బాలాదిత్యా ఎలాగో కూరగాయలు కట్ చేశావు కదా ఆ చెత్తను తీసి పక్కకు పడేయొచ్చు కదా అని మంచి మాటలతో చెప్పగా గీతు మాత్రం నేను చేయను అంటూ అతనితో వాదనకు దిగింది.
నేను ఇంతే.. ఎవరి మాట వినను.. నేను మంచిదాన్ని కాదు. నువ్వు చెప్తే నేను ఎందుకు చేయాలి అంటూ బాలాదిత్యతో అడ్డదిడ్డంగా మాట్లాడింది. అప్పుడు బాలాదిత్యా కోపగించుకోకుండా అది కాదమ్మా అని ఓపిగ్గా చెబుతున్నా కూడా గీతూ మాత్రం మరింత రెచ్చిపోయి మాట్లాడింది. ఇక మధ్యలో శ్రీహాన్ వచ్చి ఎలాగో కట్ చేశావు కదా ఆ తొక్కల్ని డస్ట్ బిన్ లో పడే అని కూల్ గా చెప్పినా కూడా నా ఇష్టం చెప్పడం ఎందుకు మీరే చేయొచ్చు కదా అంటూ ఎదురు సమాధానాలు చెబుతూ కోపం వచ్చే విధంగా మాట్లాడింది గీతూ.
నేను కుకింగ్ టైంలో ఉండి నేను వంట చేయడమే ఎక్కువ అలాంటిది.. నువ్వు చేయాల్సిన పని కూడా నేను చేశాను కూరగాయలు కటింగ్ చేశాను చెత్త కూడా నేనే పాడేయాలా? నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు పో అని అనడంతో వెంటనే బాలాదిత్యా గీతూ మాట జారుతున్నావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అని అంటాడు. అప్పుడు గీతు నేను ఇలాగే మాట్లాడుతా నాకు నచ్చినట్టే చేస్తాను చెప్పింది నేను చెయ్యను తొక్కలు పడేయను అంటూ బాలాదిత్యాకు ఎదురు సమాధానం చెబుతూ వాదనకు దిగింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో గీతూ ప్రవర్తన ఎపిసోడ్,ఎపిసోడ్ కి దారుణంగా తయారవుతోంది.
Related News
Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?
తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చి