Bachchala Malli : రేపే ‘బచ్చల మల్లి’ టీజర్ వచ్చేది
రేపు నరేష్ బర్త్ డే సందర్బంగా టీజర్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలుపుతూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసారు
- By Sudheer Published Date - 02:13 PM, Sat - 29 June 24
![Bachchala Malli : రేపే ‘బచ్చల మల్లి’ టీజర్ వచ్చేది](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Bachchala-Malli-teaser.jpg)
అల్లరి నరేష్ (Allari Naresh) సినీ కెరియర్ ఏమాత్రం బాగాలేదు. హీరోగానే కాదు సైడ్ క్యారెక్టర్ చేసిన సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. నరేష్ నుండి ఓ హిట్ వస్తే బాగుండని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తన 62 వ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli) ఫై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అమృత అయ్యర్ కథనాయికగా కనిపించనున్న ఈ సినిమాను హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అల్లరి నరేష్ కెరీర్లో 62వ సినిమా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. . రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ తదితరులు కీలక పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరపుకుంటోంది. 1990వ దశకంలో తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల స్పూర్తితో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంది. అల్లరి నరేష్ మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో మ్యాసీ హెయిర్, గడ్డంతో ఈ ఫస్ట్ లుక్‌లో కనిపించారు. ఇక రేపు నరేష్ బర్త్ డే (Naresh Birthday) సందర్బంగా టీజర్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలుపుతూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.
Read Also : UP : ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి వెళ్లిన కారు
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Bachhala Malli Glimpse : అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ గ్లింప్స్ రిలీజ్.. ఎవడి కోసం తగ్గాలి? ఎందుకు తగ్గాలి?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/baachhala-malli.jpg)
Bachhala Malli Glimpse : అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ గ్లింప్స్ రిలీజ్.. ఎవడి కోసం తగ్గాలి? ఎందుకు తగ్గాలి?
నేడు అల్లరి నరేష్ పుట్టిన రోజు కావడంతో బచ్చల మల్లి సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు.