Vaishnavi : బిగ్ బాస్-7లో బేబీ హీరోయిన్..?
బేబీ ఫేమ్ వైష్ణవి ని బిగ్ బాస్ సీజన్ 7 కు ఎంపిక చేశారనే వార్తలు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
- By Sudheer Published Date - 04:46 PM, Fri - 21 July 23

నార్త్ లో సూపర్ సక్సెస్ అయినా బిగ్ బాస్ (Bigg Boss) రియాల్టీ షో..సౌత్ లోను అంతే ఆదరణతో సీజన్ ..సీజన్ కు అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో రాణిస్తుంది. తెలుగు లో ఇప్పటివరకు ఆరు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కాగా..ఇక ఇప్పుడు ఏడో సీజన్ మొదలుకాబోతుంది. రీసెంట్ గా ప్రోమో వచ్చి , బిగ్ బాస్ అభిమానులను ఆకట్టుకుంది. హోస్టుగా మరోసారి నాగార్జున నే అలరించబోతున్నాడు. అయితే గత సీజన్ మాత్రం.. అనుకున్నంత సక్సెస్ కాలేదు. కంటెస్టెంట్లపై ప్రేక్షకులు కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. గతంలోని సీజన్ల కంటే.. ఆరోవ సీజన్ టీఆర్పీలు తక్కువగా వచ్చాయి. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు 7వ సీజన్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అస్సలు ఎంటర్మైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. అలాగే కంటెస్టెంట్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాస్త తెలిసిన వారిని..రెమ్యూనరేషన్ విషయంలో వెనుకడుగు వెయ్యకుండా తీసుకోవాలని చూస్తున్నారు.
ఈ క్రమంలో బేబీ ఫేమ్ వైష్ణవి (Vaishnavi Chaitanya) ని బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7)కు ఎంపిక చేశారనే వార్తలు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. టిక్ టాక్ , షార్ట్ ఫిలిమ్స్ తో యూత్ కు దగ్గరైన ఈ చిన్నది..తాజాగా వెండితెర కు బేబీ (Baby) సినిమాతో హీరోయిన్ గా పరిచమై సూపర్ హిట్ కొట్టింది. బోల్డ్ రోల్ లో అమ్మడి యాక్టింగ్ కు స్టార్ హీరోస్ సైతం ఫిదా అవుతున్నారు. ఆమె ఛాలెంజింగ్ రోల్ చేసిందని, ఆమె సాహసాన్ని మెచ్చుకుంటూ రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమని కితాబ్ ఇస్తున్నారు. ఈ తరుణంలో ఈమె త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు షోలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సూపర్ హిట్ కొట్టి ఫార్మ్ లోకి వచ్చిన వైష్ణవి బిగ్ బాస్ హౌస్లోకి వెళుతుందా? అనే సందేహాలు అందరు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ..ఈ ప్రచారం చూసిన వారంతా వైష్ణవి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే మాములుగా ఉండదని కామెంట్స్ వేస్తున్నారు.
Read also : Marathi Film: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మరాఠీ మూవీ, 3 వారాల్లో 58 కోట్లు వసూలు