Pawan Kalyan: అన్నయ్య చిరంజీవి రివాల్వర్ తో కాల్చుకోవాలనుకున్నా: పవన్ కళ్యాణ్
తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ అందర్నీ ఆకర్షిస్తోంది.
- By Balu J Published Date - 05:08 PM, Tue - 7 February 23
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి నటసింహా బాలయ్య షోతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోలో యూట్యూబ్ లో, టాలీవుడ్ సర్కిల్ లో ట్రెండింగ్ గా మారింది. పవన్ కళ్యాణ్ తన లైఫ్, సినిమాలు, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడంతో ఈ షో ఆసక్తిని రేపుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ అందర్నీ ఆకర్షిస్తోంది. చాలామందిలాగే నేను కూడా ఒత్తిడి బారిన పడ్డానని, కానీ దాంతో పోరాడనని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ముగింపు ఎపిసోడ్ ఫిబ్రవరి 10న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎపిసోడ్ మొదటి భాగం వదిలిన మొదటి ఐదు నిమిషాల్లో అత్యధిక సంఖ్యలో యాప్ డౌన్‌లోడ్‌లతో రికార్డు సృష్టించింది. నందమూరి బాలకృష్ణతో తన జర్నీ గురించి మాట్లాడుతూ యుక్త వయసులో తాను నిరాశతో బాధపడ్డానని, ఎన్నో మానసిక సంఘర్షణలకు గురయ్యానని అన్నారు.
“నాకు ఉబ్బసం ఉంది. తరచుగా ఆసుపత్రిలో చేరడం వల్ల ఒంటరిగా మారాల్సి వచ్చింది. ఇతరులతో కలవడం కూడా చాలా తక్కువ. 17 ఏళ్ళ వయసులో ఒత్తిడి బారిన పడ్డాను. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మా అన్నయ్య (చిరంజీవి) లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో నా ప్రాణం తీయాలని ప్లాన్ చేసుకున్నా ” అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అన్నయ్య (నాగబాబు) వదిన (సురేఖ) సమస్యను గుర్తించి తన అన్నయ్య చిరంజీవికి తెలియజేశారన్నారు. అప్పటి నుండి నేను పుస్తకాలు చదవడం, కర్ణాటక సంగీతం, మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకోవడంతో ఒత్తిడి నుంచి బయటపడ్డాను”అని పవన్ కళ్యాణ్ అన్నారు.