Love Me Trailer : ‘లవ్ మీ’ ట్రైలర్ చూశారా.. దయ్యం ప్రేమ కోసం హీరో..
ఆశిష్, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ ‘లవ్ మీ’ ట్రైలర్ చూశారా..?
- By News Desk Published Date - 05:37 PM, Thu - 16 May 24

Love Me Trailer : టాలీవుడ్ యువ హీరో ఆశిష్, హీరోయిన్ వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ ‘లవ్ మీ’. దిల్ రాజు సమర్పణలో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు అరుణ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ అండ్ సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు. ఆ ట్రైలర్ వైపు ఓ లుక్ వేసేయండి.
థ్రిల్లింగ్ విషయాలు, అడ్వెంచర్స్ పై క్యూరియాసిటీ ఉన్న ఒక కుర్రాడికి ఒక దెయ్యం కథ తెలిస్తే.. తాను ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది. ఒక ఊరంతా ఒక దెయ్యానికి బయపడుతుంటే.. ఆ ఉరి దెయ్యం కథ తెలుసుకున్న ఆ హీరో ఆ దెయ్యంతో ప్రేమాయణం నడపడానికి అక్కడికి వెళ్తాడు. ఆ తరువాత ఏం జరిగింది అనేది సినిమా కథ.
ఈ సినిమాలో ఆశిష్, వైష్ణవితో పాటు సిమ్రాన్ చౌదరి, రవి కృష్ణ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే పోస్టుపోన్ అయిన ఈ చిత్రం మే 25న తప్పకుండా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. మరి మొదటి మూవీతో ఓకే అనిపించుకున్న ఆశిష్.. ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ని చూస్తారో చూడాలి.