HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ap High Court Dismissed Case On Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి భారీ ఊరట..కీలక కేసు కొట్టివేత

మెగాస్టార్ చిరంజీవి కి భారీ ఊరట లభించింది

  • By Sudheer Published Date - 07:37 PM, Tue - 25 July 23
  • daily-hunt
Chiranjeevi knee surgery
Chiranjeevi knee surgery

మెగాస్టార్ చిరంజీవి కి భారీ ఊరట లభించింది. 2014 ఎన్నికల సమయంలో చిరంజీవిపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు (AP High Court ) నేడు కొట్టివేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

చిత్రసీమలో మెగాస్టార్ గా ఉన్నత శిఖరాలకు చేరుకున్న చిరంజీవి..రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. ప్రజారాజ్యం(Prajarajyam Party) పేరుతో 2008 లో పార్టీ పెట్టిన చిరంజీవి..2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల బరిలో పోటీ చేసారు. 294 స్థానాల్లో ప్రజారాజ్యం తరుపు అభ్యర్థులు బరిలో నిల్చుంటే.. 18 స్థానాలు మాత్రం గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 18% ఓట్లు ఈ పార్టీ దక్కించుకుంది. చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానం నుండి మాత్రమే గెలుపొందాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆగష్టు 2011 లో భారత జాతీయ కాంగ్రెస్ (Congress Party) పార్టీలో ప్రజారాజ్యం ను విలీనం చేసారు.

2014 ఎన్నికల సమయంలో గుంటూరు లో చిరంజీవి (Chiranjeevi) కాంగ్రెస్ పార్టీ తరపున ఓ సమావేశం ఏర్పాటు చేసారు. నిర్ణీత టైంలోపు మీటింగ్‌ పూర్తి చేయకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు వచ్చాయని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని చిరంజీవిపై కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కొన్నాళ్ల క్రితం ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court ) ను ఆశ్రయించారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం చిరంజీవిపై నమోదైన కేసును కొట్టేస్తూ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది.

ఇదే కాదు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ (Chiranjeevi Blood Bank) విషయంలో ప్రముఖ సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు ఇటీవల కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. న్యాయ స్థానం వారికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ గత వారం తీర్పును వెల్లడించింది. హైదరాబాద్ నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ ఈ సంచలన తీర్పును వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై గతంలో వారు చేసిన ఆరోపణలకు సంబంధించి దాఖలైన పరువు నష్టం దావాపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది. ఇలా వారం లో రెండు మెగా శుభవార్తలు అభిమానులను సంతోషానికి గురి చేస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన భోళా శంకర్ (Bhola Shankar) మూవీ ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో తమన్నా, కీర్తిసురేష్ , సుశాంత్ లు ప్రధాన పాత్రలు చేసారు.

Read Also :Pre Release : ఆలస్యంగా ‘BRO’ ప్రీ రిలీజ్ వేడుక..మేకర్స్ ప్రకటన


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP high court
  • AP high court dismissed case
  • chiranjeevi
  • poll code violation case

Related News

Mana Shankara Varaprasad Ga

Chiranjeevi : మీసాల పిల్ల పాట రిలీజ్ చేసి అనిల్ రావిపూడి తప్పు చేశారా?

చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ మన శంకర వరప్రసాద్ గారు ‘. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పండక్కి వస్తున్నాడు అనే ట్యాగ్ లైన్ తో సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలనే టార్గెట్ గా పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారు. సెట్స్ పైకి తీసుకెళ్లినప్పటి నుంచే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. తరచుగా ఏదొక అప్డేట్ అందిస్తూ సినిమాపై జనాల్లో ఇంట్రెస్ట్

  • High Court angered by AP Education Commissioner

    AP Police Department : పోలీస్ శాఖను మూసేయడం బెటర్ – హైకోర్టు అసంతృప్తి

Latest News

  • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

  • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd