Anushka: ఆ విషయంలో ‘స్విటీ’నే టాప్!
టాలీవుడ్ జేజమ్మ అనగానే అందిరికీ గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి.
- By Balu J Published Date - 02:28 PM, Mon - 25 April 22

టాలీవుడ్ జేజమ్మ అనగానే అందిరికీ గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. ‘అరుంధతి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ పెరిగిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ ఒరియంటేడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అగ్ర హీరోలకు సైతం పోటీగా నిలిచింది. ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రెమ్యునరేషన్ (పారితోషికం) విషయంలోనూ జేజమ్మ అనిపించుకుంటోంది. మొదటి సినిమాకు కేవలం రూ. 3 లక్షలు అందుకున్న బ్యూటీ.. ఆ తర్వాత సినిమాలకు రెమ్యూనరేషన్ పెంచుకుంటే పోతుందే తప్పా.. ఏమాత్రం తగ్గించడం లేదు. హీరోలకు ధీటుగా రెమ్యూనరేషన్ ను సొంతం చేసుకుంటుంది. తాజాగా యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పొలిశెట్టితో అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకుగాను స్విటీ ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుందట. ఈ విషయంలో అంటే సౌత్ ఇండస్ట్రీలో మన స్విటీనే టాప్ అని చెప్పక తప్పదు. ‘బాహుబాలి, అరుంధతి, మిర్చి’ లాంటి విజయాలతో టాలీవుడ్ పై తనదైన ముద్ర వేసింది.