Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పింక్ బేబీ
- Author : Praveen Aluthuru
Date : 27-05-2023 - 7:43 IST
Published By : Hashtagu Telugu Desk
Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఒకటి. మే 16 నుంచి 23 వరకు జరిగిన ఈ వేడుకలో భారతదేశానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మానుషి చిల్లర్, మృణాల్ ఠాకూర్, సప్నా చౌదరి వంటి పలువురు ప్రముఖ బాలీవుడ్ నటీమణులు కూడా ఈ ఈవెంట్‌లో రంగప్రవేశం చేశారు. సినీ నటి అనుష్క శర్మ కూడా ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. ఈ సమయంలో అనుష్క డిఫరెంట్ లుక్స్‌లో కనిపించింది. దానికి సంబంధించిన ఫోటోలను అనుష్క తాజాగా ఇంస్టాగ్రామ్లో పంచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనుష్క ధరించిన డ్రెస్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ డ్రెస్ లో కోహ్లీ సతీమణి చాలా అందంగా కనిపిస్తుంది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న అనుష్క శర్మ గులాబీ మరియు నలుపు దుస్తులలో కనిపించింది. ఈ పింక్ కలర్ శాటిన్ స్ట్రాప్‌లెస్ ఆఫ్ షోల్డర్ టాప్‌లో ఆమె గ్లామరస్‌గా కనిపిస్తోంది. బాటమ్ లో మెరిసే నల్లటి ప్యాంటును ధరించింది. ఆమె తక్కువ మేకప్‌తో వజ్రాల ఆభరణాలను ధరించింది. డైమండ్ ఇయర్ కఫ్స్, చెవిపోగులు ఆమె అందాన్ని మరింత పెంచాయి. ఇది కాకుండా అనుష్క తన చేతికి ఉంగరం ధరించింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అనుష్క శర్మ స్పెషల్ డ్రెస్ లో అదరగొట్టింది. అతిగా పోకుండా కూల్ డ్రెస్ లో తక్కువ మేకప్ తో ఫ్రెష్ లుక్ లో కనిపించింది. ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు సంబంధించి ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో క్షణాల్లో వైరల్ గా మారాయి. అభిమానులు కూడా ఆమె ఈ లుక్‌ని బాగా ఇష్టపడుతున్నారు.
Read More: K Raghavendra Rao : రాఘవేంద్ర కొడుకు హీరోగా రెండు సినిమాలు చేసిన విషయం తెలుసా?