Vikram : రాజకీయాల్లోకి తమిళ్ ఇండస్ట్రీ నుండి మరో స్టార్..?
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని చెబుతూ తనకి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉంది.. కానీ అంటూ గ్యాప్ ఇచ్చారు
- By Sudheer Published Date - 03:26 PM, Mon - 5 August 24

సినీరంగానికి..రాజకీయరంగానికి దగ్గర సంబంధం ఉంది. చిత్రసీమలో ప్రేక్షకులను అలరించిన స్టార్స్..రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలనీ భావిస్తుంటారు. ఇప్పటికే పలువురు ఆలా వచ్చి ముఖ్యమంత్రులుగా , మంత్రులుగా , ఎమ్మెల్యేలుగా ఇలా పలు ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేసారు. అయితే వీరిలో కొంతమంది అగ్ర స్థానానికి చేరుకోగా..మరికొంతమంది రాజకీయాల్లో రాణించలేక..రాజకీయాల్లో ఉండే ఒత్తిడి తట్టుకోలేక మళ్లీ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. ప్రస్తుతం తమిళనాట అగ్ర హీరోలుగా గుర్తింపు పొందిన నటులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే విజయ్ (Vijay) సొంతగా పార్టీ ప్రకటించి..రాజకీయ వ్యవహారాల్లో బిజీ అయ్యాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక విజయ్ బాటలోనే మరికొంతమంది హీరోలు రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. తాజాగా నటుడు విక్రమ్ (Vikram)..తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో రాజకీయ ఎంట్రీ గురించి చెప్పకనే చెప్పాడు. విక్రమ్ నటిస్తున్న తాజాగా చిత్రం ‘తంగలాన్ ‘ (Thangalaan ). ఆగస్టు 15 న పలు భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ లో విక్రమ్ మాట్లాడుతూ.. తంగలాన్ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని..సినిమా చాల బాగా వచ్చిందని సినిమా విశేషాలను చెప్పుకొచ్చారు. అలాగే పొలిటికల్ ఎంట్రీ ఫై కూడా చెప్పకనే చెప్పాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని చెబుతూ తనకి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉంది.. కానీ అంటూ గ్యాప్ ఇచ్చారు. దీనికి సంబందించిన వీడియో వైరల్ అవ్వడంతో ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ విక్రమ్ త్వరలోనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : Rohit Sharma : రోహిత్ మామూలోడు కాదు.. ద్రవిడ్‌కు షాక్.. గంగూలీకి ఎసరు..