Devara : దేవర ఖాతాలో మరో రికార్డు
Devara : గ్లోబల్ టాప్ 10 మూవీస్‌లో మూడు వారాలపాటు నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఇదే స్థాయిలో నిలిచిన తొలి తెలుగు సినిమా కావడం విశేషం
- By Sudheer Published Date - 03:20 PM, Sat - 19 July 25

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” (Devara) పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి రోజే భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా.. వారం రోజుల్లోనే మంచి వర్డ్ ఆఫ్ మౌత్ తో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి, బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల మార్క్‌ను దాటింది. ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్, తండ్రీ కొడుకుల కథ, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి “దేవర” సినిమాను అభిమానులకు ఓ ఫెస్టివల్ లా మార్చేశాయి.
థియేటర్ల రన్ తర్వాత “దేవర” నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. సినిమా డిజిటల్ వేదికపైకి వచ్చిన వెంటనే ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. విడుదలైన మొదటి వారంలోనే అత్యధికంగా వీక్షించిన సినిమాగా మారింది. అంతేకాదు గ్లోబల్ టాప్ 10 మూవీస్‌లో మూడు వారాలపాటు నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఇదే స్థాయిలో నిలిచిన తొలి తెలుగు సినిమా కావడం విశేషం.
Shubman Gill: కెప్టెన్సీలో గిల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది: మాజీ క్రికెటర్
తాజా సమాచారం ప్రకారం.. “దేవర” ఓటీటీలో ఇప్పటివరకు 16.1 మిలియన్ వ్యూస్ రాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది ఎన్టీఆర్ స్టార్‌డమ్‌కు సాక్ష్యంగా నిలిచిందని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో విజయం సాధించిన ఈ సినిమా.. డిజిటల్ మీడియాలోనూ అదే జోష్ తో కొనసాగుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించగా.. అనిరుధ్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పాటలు, బీజీఎం సినిమాకు భారీ ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌కు అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం హై లెవెల్‌ను అందించింది. ఇంతటి విజయాన్ని చూసిన దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ కలయికలో “దేవర 2” కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది.