Anjali Another Different role in Bahishkarana Web Series : అంజలిని వేశ్యగా మారుస్తున్న టాలీవుడ్..!
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమాలో అంజలి చేసిన పాత్రకు బాగానే క్రేజ్ తెచ్చుకుంది. అంజలిని ఇలా ఎప్పుడు చూడలేదని ఆమె ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.
- Author : Ramesh
Date : 05-07-2024 - 11:29 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు అమ్మాయి అంజలి (Anjali) ఫోటో సినిమాతో తెరంగేట్రం చేయగా ఆ తర్వాత కోలీవుడ్ చెక్కేసి అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళంలో గుర్తింపు తెచ్చుకున్నాక తెలుగు తెరకు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఆడియన్స్ కు దగ్గరైన అంజలి ఆ తర్వాత తన మార్క్ పాత్రలతో అలరిస్తూ వస్తుంది. ఇక ఈమధ్య అంజలి వేశ్య పాత్రలు కూడా చేస్తుంది.
విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమాలో అంజలి చేసిన పాత్రకు బాగానే క్రేజ్ తెచ్చుకుంది. అంజలిని ఇలా ఎప్పుడు చూడలేదని ఆమె ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఐతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత మరోసారి వేశ్య పాత్రలో అంజలి నటిస్తుంది. ఐతే ఈసారి సినిమా కోసం కాదు వెబ్ సీరీస్ కోసమని తెలుస్తుంది.
అంజలి లీడ్ రోల్ లో బహిష్కరణ (Bahishkarana) అనే సినిమా వస్తుంది. ఈ సీరీస్ ను ముఖేష్ ప్రజాపతి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అంజలి వేశ్యగా నటిస్తుంది. సీరీస్ కు సంబందించిన పోస్టర్ తో సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. మరి ఈ సీరీస్ లో అంజలి ఎలా ప్రేక్షకులను అలరిస్తుంది అన్నది చూడాలి. ఐతే అంజలి ఒకప్పుడు హోంలీ పాత్రలు చేస్తూ అలరించేది ఇప్పుడు ఆమెకు వేశ్య పాత్రలు ఇస్తూ వస్తున్నారు.