Animal OTT Release Date : యానిమల్ OTT రిలీజ్ డేట్ లాక్.. ఎందులో వస్తుంది అంటే..!
రణ్ బీర్ కపూర్ సందీప్ వంగ కాంబోలో వచ్చిన యానిమల్ (Animal) సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. టీ సీరీస్ నిర్మించిన
- By Ramesh Published Date - 03:07 PM, Tue - 19 December 23

రణ్ బీర్ కపూర్ సందీప్ వంగ కాంబోలో వచ్చిన యానిమల్ (Animal) సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. టీ సీరీస్ నిర్మించిన ఈ సినిమా 800 కోట్ల పైగా గ్రాస్ రాబట్టింది. ఇంకా సినిమా రన్ అవుతుంది. ఫుల్ రన్ లో 1000 కోట్లు కొడుతుందా లేదా అని బాలీవుడ్ ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యానిమల్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేశారు. జనవరి 26న యానిమల్ ఓటీటీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ వారు యానిమల్ సినిమాను భారీ ధరకే ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.
యానిమల్ సినిమా థియేట్రికల్ గా బంపర్ హిట్ అందుకుంది కచ్చితంగా ఓటీటీ లో కూడా అదే రేంజ్ సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. థియేటర్ కి వెళ్లి రిపీటెడ్ గా చూడలేని ఆడియన్స్ అంతా కూడా నెట్ ఫ్లిక్స్ లో చూసేస్తారు. రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న నటించిన ఈ సినిమా అమ్మడి ఖాతాలో కూడా అద్భుతమైన విజయాన్ని అందించింది.
Also Read : Salaar : హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఫై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం..
We’re now on WhatsApp : Click to Join