Prabhas: యానిమల్ సక్సెస్ తో ప్రభాస్ ‘స్పిరిట్’ పై భారీ అంచనాలు
డైరెక్టర్ సందీప్ వంగ ప్రభాస్ తో సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 04:23 PM, Thu - 14 December 23

Prabhas: “యానిమల్” మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈ సంవత్సరం బాలీవుడ్‌లో మూడవ అతిపెద్ద హిట్‌గా నిలిచింది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వసూళ్లు రూ.800 కోట్ల మార్కుకు దగ్గరలో ఉంది. అయితే సందీప్ వంగ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రైమ్ డ్రామాలో పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
అయితే “స్పిరిట్” కోసం సందీప్ స్క్రీన్ ప్లే రాయడం ప్రారంభించబోతున్నాడు. అయితే ఫైనల్ స్క్రిప్ట్ ఇంకా ఖరారు కాలేదు. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ఈ చిత్రానికి సహ నిర్మాతగా టి సిరీస్ వ్యవహరించనున్న నేపథ్యంలో భారీ సినిమాగా తెరకెక్కే అవకాశాలున్నాయి. సందీప్ రెడ్డి, ప్రభాస్‌ల కలయికలో రాబోతున్న ఈ మూవీ భారీ ప్రీ-రిలీజ్ వ్యాపార ఒప్పందాలను ఆకర్షిస్తుందని తెలుస్తోంది. “స్పిరిట్” చిత్రీకరణ సెప్టెంబర్ 2024లో ప్రారంభం కానుంది.
Also Read: AP Exams: మార్చి నెలలో పది, ఇంటర్ పరీక్షలు : ఏపీ మంత్రి బొత్స