Animal Party: వైరల్ అవుతున్న యానిమల్ సక్సెస్ పార్టీ
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.
- By Praveen Aluthuru Published Date - 05:23 PM, Mon - 8 January 24
Animal Party: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సందీప్ వంగ దర్శకత్వం, రన్ బీర్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచాయి. యానిమల్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ సెట్టింగులు, భారీ యాక్షన్ సీన్స్ లేకపోయినా సినిమాలో బలమైన కథ ఉండటంతో బొమ్మ బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది.
యానిమల్ సినిమా భారీ విజయం సాధించడంతో గ్రాండ్ పార్టీ చేసుకుంది చిత్ర యూనిట్. ఈ పార్టీకి యానిమల్ టీమ్ తో పాటు ఆలియా భట్, మహేష్ భట్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా, ఆయుస్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్ తదితరలు హాజరయ్యారు. అయితే.. రణ్ బీర్ కపూర్, రష్మిక, బాబీ డియోల్, అనిల్ కపూర్, సందీప్ రెడ్డి తదితర యానిమల్ టీమ్ అంతా హాజరయ్యారు. ఈ పార్టీలో భాగంగా ఓ ఫోటో వైరల్ అవుతుంది. నోటీ పై వేలు వేసుకుని ఫోటోలుకు స్టిల్ ఇచ్చారు. యానిమల్ మూవీని విమర్శిస్తున్న వారికి సమాధానంగా ఈ సైలెన్స్ అన్నట్టుగా ఫోజులు ఇచ్చారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
రణ్ బీర్ కపూర్, రష్మికను హగ్ చేసుకుని కిస్ ఇస్తూ యానిమల్ పార్టీకి వెల్ కమ్ చెప్పారు. ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పార్టీలో మిల్కీబ్యూటీ తమన్నా హాట్ లుక్ లో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మొత్తానికి యానిమల్ మూవీ ఆడియన్స్ కి మాత్రమే కాదు.. ఫిల్మ్ మేకర్స్ కు కూడా షాక్ ఇచ్చింది. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్ కలెక్షన్స్ తో షేక్ అయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ అనౌన్స్ చేశాడు. మరి.. యానిమల్ పార్క్ ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో వెయిట్ చేయాల్సిందే.
Also Read: Heinrich Klassen: విధ్వంసకరుడు హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్
Related News
NTR : హృతిక్, రణ్బీర్తో ఎన్టీఆర్ పార్టీలు.. వీడియో వైరల్..
హృతిక్, రణ్బీర్తో కలిసి ఎన్టీఆర్ బాలీవుడ్ లో పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారు. తారక్ తో పాటు ఆయన సతీమణి..