Andrea Jeremiah : 11 ఏళ్ల వయసులోనే లైంగిక వేదింపుకు గురైనట్లు తెలిపిన ఆండ్రియా..
- By Sudheer Published Date - 11:06 AM, Mon - 4 March 24

లైంగిక వేదింపులు (Harassment) అనేవి ఇటీవల కాలంలో మరి ఎక్కువైపోయాయి. ఒంటరిగా మహిళా (Female) కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలకే కాదు చిత్రసీమలో హీరోయిన్లు సైతం ఈ వేదింపులు ఎదురుకుంటూనే ఉన్నారు. తాజాగా తన 11 ఏళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు నటి ఆండ్రియా తెలిపింది. 2005లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తమిళంతో పాటు తెలుగు మలయాళం సినిమాల్లో నటిస్తూ వస్తుంది. చెన్నై లోని అరక్కోణంలో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించింది. ఆమె నుంగంబాక్కంలోని మహిళా క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
చిన్నప్పటి ఉండే పాటలు పాడడం అలవాటు చేసుకున్న ఈమె..చిత్రసీమలో అడుగుపెట్టిన తర్వాత కూడా హీరోయిన్ గా చేస్తూనే తమిళంతో పాటు తెలుగులో కూడా పదుల సంఖ్యలో సూపర్ హిట్ సాంగ్స్ ను ఆలపించింది. బొమ్మరిల్లుతో మొదలు పెట్టి..స్టార్ హీరోల సినిమాల్లో హిట్ సాంగ్స్ ను ఆలపించింది. ఇక తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను ఆమె ఏ మాత్రం దాపరికం లేకుండా బయటపెడుతూ వస్తోంది. ఇప్పటికే తన లవ్ లైఫ్ గురించి బయట పెట్టేసింది ఆండ్రియా. ఇక తన జీవితంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి కూడా ఆండ్రియా తెలిపింది.
11 సంవత్సరాల వయసులోనే తనని ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడని వివరించింది ఆండ్రియా. బస్సులో వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి తన టీ షర్ట్ లో చేయి వేసి ఎంతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఈ ఘటన జరిగిన వెంటనే భయపడిపోయాను. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా భయంతో వచ్చి మా నాన్న పక్కన కూర్చున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పలేక ఏడుపు మొదలుపెట్టానని ఆండ్రియా తెలిపింది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే నెటిజన్లు, ఆమె అభిమానులు ఓదారుస్తూ..ఆమెకు సపోర్ట్ గా నిలిచి ఆమె ధైర్యానికి మెచ్చుకుంటున్నారు.
Read Also : Women’s Migraine: పురుషుల కంటే స్త్రీలలోనే మైగ్రేన్ సమస్యలు