Anasuya : భర్తతో కలిసి వర్కౌట్స్ చేస్తున్న అనసూయ.. కొత్త సంవత్సరం మొదటిరోజే ఇలా హాట్ గా..
అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అనసూయతో కలిసి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటో షేర్ చేసాడు.
- Author : News Desk
Date : 02-01-2025 - 10:58 IST
Published By : Hashtagu Telugu Desk
Anasuya : నటి, యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు పలు టీవీ షోలలో కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలు కూడా పోస్ట్ చేస్తుంది. అప్పుడప్పుడు అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ కూడా ఫ్యామిలీ ఫోటోలు పోస్ట్ చేస్తాడు.
అనసూయ తన ఫ్యామిలీతో న్యూ ఇయర్ సందర్భంగా ఓ బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేసి నిన్న ఫోటోలు కూడా షేర్ చేసింది. అయితే అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అనసూయతో కలిసి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటో షేర్ చేసాడు. ఈ ఫోటోలో ఇద్దరూ జిమ్ లో బాగా కష్టపడిన తర్వాత అద్దం ముందు ఫోటో దిగారు. అనసూయ భర్త కూర్చోగా అనసూయ పక్కనే నిలబడి జిమ్ డ్రెస్ లో తన అందాలు చూపిస్తూ హాట్ ఫోజ్ ఇచ్చింది.
అనసూయ ఇలా భర్తతో కలిసి ఇలా హాట్ ఫోజ్ ఇవ్వడం, సుశాంక్ దాన్ని ఇలా షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఏజ్ లో కూడా అనసూయ మంచి ఫిట్నెస్ మెయింటైన్ కోసం బాగానే కష్టపడుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Manchu Vishnu : మంచు విష్ణు సంచలన పోస్ట్.. తమ్ముడి కోసమేనా ?