Anasuya Bharadwaj : వారానికి మూడు సార్లే..ఎక్కువ సార్లు కుదరడం లేదు – అనసూయ
ఇటీవల అనసూయ కాస్తా బొద్దుగా కనిపిస్తోంది. దీంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.తాజాగా అభిమానులతో ముచ్చటించిన అనసూయ దీనిపై రియాక్ట్ అయ్యింది
- Author : Sudheer
Date : 11-07-2024 - 5:33 IST
Published By : Hashtagu Telugu Desk
అనసూయ (Anasuya Bharadwaj) ..పరిచయం అవసరం లేని పేరు. చిన్న పిల్లాడి దగ్గరి నుండి పండు ముసలాడి వరకు అనసూయ గ్లామర్ కు ఫిదా అవ్వాల్సిందే. ఇద్దరు పిల్లలకు తల్లయినప్పటికీ ..తన గ్లామర్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అప్పుడెప్పుడో న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పరిచమైన ఈమె జాతకాన్ని జబర్దస్త్ షో మార్చేసింది. కొన్నేళ్ల పాటు ఈ షో కు యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఆ తర్వాత సినిమా ఛాన్సులు తలుపు తట్టడం..అక్కడ కూడా సక్సెస్ కావడం తో ఇక బుల్లితెర యాంకర్ కు బై బై చెప్పేసింది. ఇక సోషల్ మీడియా (Anasuya Social Media) లో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలియంది కాదు..తనపై వచ్చే విమర్శలకు , కౌంటర్లకు ఘాటైన సమాదానాలు చెపుతూనే..మరోపక్క అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాదానాలు చెపుతుంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల అనసూయ కాస్తా బొద్దుగా కనిపిస్తోంది. దీంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.తాజాగా అభిమానులతో ముచ్చటించిన అనసూయ దీనిపై రియాక్ట్ అయ్యింది. మీరు డైలీ జిమ్ (Anasuya GYM) చేస్తారన్న ప్రశ్నకు.. రోజూ జిమ్ చేయాలని నాకు ఉంటుంది కానీ.. ఇప్పుడున్న నా షెడ్యూల్స్ కి అసలు టైం కుదరడం లేదు.. వారానికి మూడు సార్లు ఖచ్చితంగా జిమ్ చేసేందుకు ట్రై చేస్తా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇక మరికొంతమంది నెటిజెన్లు పలు రకాలుగా ప్రశ్నలు అడగ్గా…. వాటికి అనసూయ చాలా క్రేజీగా సమాధానాలు చెప్పింది. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : TGSWREIS : బాబోయ్..హాస్టల్స్ లలో ఎలుకలు స్వైర విహారం..ఉండలేకపోతున్నాం