Anasuya: నెట్టింట్లో దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్స్.. ఇంకా రెచ్చగొడుతున్నావు ఆంటీ అంటూ ట్రోల్స్?
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి
- By Nakshatra Published Date - 04:38 PM, Thu - 30 March 23
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు తెలుగు బుల్లితెరపై యాంకర్ తన సత్తాని చాటిన అనసూయ ప్రస్తుతం నటిగా వెండితెర పై వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది అనసూయ భరద్వాజ్.
ఇది ఇలా ఉంటే అనసూయ సినిమాల ద్వారా కంటే ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీల ద్వారా ఎక్కువగా హైలెట్ అవుతోంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె చేసే ట్వీట్లు ఫోటోషూట్లు వీడియోస్ రీల్స్ పై నెటిజన్స్ ట్రోల్స్ చేయడం అందుకు ఆమె గట్టిగా కౌంటర్ ఇవ్వడం ఇలా తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో అనసూయ కొందరు ఆంటీ అంటూ దారుణంగా ట్రోల్స్ చేసి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. వారిపై ఘాటుగా స్పందించింది. ఇకపోతే అనసూయ ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఇప్పటికీ అలాగే పొట్టి పొట్టి నిక్కర్లు నడుము ఎద అందాలు కనిపించే విధంగా బట్టలను వేసుకొని యూత్ ని రెచ్చగొడుతోంది.
దీంతో దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. నువ్వు అలాంటి దుస్తులు ధరిస్తే ట్రోలింగ్స్ ఇలాగే వస్తాయి అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. ట్రోలింగ్స్ తగ్గాలి అంటే ముందుగా ఆమె వస్త్రధారణ బాగుండాలి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ పై స్పందించిన అనసూయ నేను ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి మీరు ఎవరూ మాకు నచ్చినట్లు మేము ఉంటాము అంటూ వారిపై మండిపడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అనసూయ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. హార్ట్ వీట్లో సోషల్ మీడియాలో మహిళలు ప్రజాప్రతినిధులు సినీ నటులపై అభ్యంతరమైన పోస్టులు పెడితే కఠినమైన చర్యలు తప్పవు అంటూ హైదరాబాదు క్రైమ్ డిసిపి స్నేహ మెహ్రా హెచ్చరించారు.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 29, 2023
అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే 20 మందికి పైగా కేసు నమోదు చేయగా ఎనిమిది మందిపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అదే పోస్ట్ ని అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ సెల్యూట్ అని ఎమోజిని క్యాప్షన్ గా జోడించింది. ఇక ఆ పోస్ట్ ని చూసిన నేటిజన్స్ మరింత రెచ్చిపోతున్నారు. అటువంటి పోస్టులు మరింత రెచ్చగొడుతున్నావు ఆంటీ అంటూ అనసూయ పై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఆంటీలు ఆంటీలు లాగా ఉంటే ఎవరికి ప్రాబ్లం లేదు అసభ్యకరమైన ఫోటోలు పెడితేనే ఘాటుగా రిప్లై ఇస్తాం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Related News
Chiranjeevi: చిరంజీవి మేడే గ్రీటింగ్స్.. చైల్డ్ లేబర్ పై వీడియో షేరింగ్
Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మే డే సందర్భంగా ప్రజలకు, అభిమానులకు, సినీ కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ యాడ్ వీడియోను పోస్ట్ చేశారు. బాలకార్మిక వ్యవస్థ అనే సామాజిక దురాచారాన్ని రూపుమాపడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ వో) చేస్తున్న ప్రచారం కోసం ఈ ప్రకటనను చిత్రీకరించినట్లు ఎక్స్ (ట్విట్టర్)లో చిరంజీవి ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ‘చిన్నిచేతులు’ ప�