Liger : రౌడీ.. హౌడీ.. బాలీవుడ్ బ్యూటీతో గుర్రపు స్వారీ!
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ డైరెక్షన్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరింది. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటున్న లైగర్ కు సంబంధించిన ప్రతి అప్ డేట్ ఆసక్తికరంగా మారుతోంది.
- By Balu J Published Date - 04:43 PM, Mon - 22 November 21

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ డైరెక్షన్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరింది. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటున్న లైగర్ కు సంబంధించిన ప్రతి అప్ డేట్ ఆసక్తికరంగా మారుతోంది.
రీసెంట్ గా బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ తన షెడ్యూల్ ను కంప్లీట్ చేయడానికి సెట్ లో అడుగుపెట్టారు. ఫేస్ టు ఫేస్ అంటూ విజయ్, టైసన్ రంగంలోకి దిగిపోయారు. లైగర్ మూవీ ప్రస్తుతం యూఎస్ ఏలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఏమాత్రం గ్యాప్ దొరికినా లైగర్ టీం మస్త్ ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా మైక్ టైసన్ పిక్స్ వైరల్ కాగా.. తాజాగా హీరో విజయ్ దేవరకొండ ఫొటోలు సోషల్ మీడియాలో అట్రాక్షన్ గా మారాయి.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే లైగర్ లో నటిస్తోంది. ఆమె హీరో విజయ్ దేవరకొండతో కలిసి హార్స్ రైడింగ్ వెళ్లింది. ఈ క్రమంలోనే గుర్రంపై కూర్చుని ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ “హౌడీ రౌడీ” అని రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరో విజయ్ మాత్రం కాస్త లేట్ గా స్పందిస్తూ.. ‘‘ఐ లైక్ హార్స్.. ఐ వాంట్ వన్ ఆఫ్ మై ఓన్’’ అంటూ రాసుకొచ్చారు.
Related News

Junior Mehmood: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ (Junior Mehmood) మరణించారు. గురువారం అర్థరాత్రి ఆయన తుది శ్వాస విడిచారు.