Anandi : భర్త ప్రోత్సాహంతో ఆనంది అలాంటి పాత్ర చేసిందట..!
తెలుగు అమ్మాయి అయిన ఆనంది (Anandi ) తమిళంలో వరుస సినిమాలతో అక్కడ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. తెలుగులో హీరోయిన్ గా ప్రయత్నాలు చేసినా
- By Ramesh Published Date - 11:05 AM, Fri - 5 January 24

తెలుగు అమ్మాయి అయిన ఆనంది (Anandi ) తమిళంలో వరుస సినిమాలతో అక్కడ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. తెలుగులో హీరోయిన్ గా ప్రయత్నాలు చేసినా అమ్మడికి అంతగా క్రేజ్ రాలేదు కానీ కోలీవుడ్ లో మాత్రం ఆనందికి మంచి పాపులారిటీ వచ్చింది. హీరోయిన్ గా చేస్తున్న టైం లోనే కో డైరెక్టర్ సోక్రటీస్ ని పెళ్లాడిన ఆనంది పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ అలరిస్తుంది. తెలుగులో బస్టాప్, జాంబీ రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాల్లో నటించిన ఆనంది ప్రస్తుతం తమిళంలో మంగై సినిమాలో నటిస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
ఈ సినిమాలో ఆనంది బోల్డ్ సీన్స్ లో నటించింది. అయితే తన భర్త చెప్పడం వల్లే ఈ సినిమాలో నటించానని అంటుంది అమ్మడు. మన్నార్ నుంచి చెన్నైకి ప్రయాణించే ఒక అమ్మాయి మీద మగాడి ఏయే కోణాల్లో చూస్తాడు అన్న కథాంశంతో ఈ సినిమా వస్తుంది. సినిమా లో చాలా వరకు బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉన్నాయట. అయితే ఒక పెళ్లైన అమ్మాయిలా కాకుండా ఒక నటిగా ఈ సినిమా చేయమని తన భర్త ప్రోత్సహించాడని అందుకే ఈ సినిమాలో నటించానని అంటుంది ఆనంది.
హీరోయిన్స్ పెళ్లైన తర్వాత అలాంటి సినిమాలు చేయొద్దు… ఇలాంటి సినిమాలు చేయొద్దు అని కొన్ని రిస్టిక్షన్స్ ఉంటాయి. కానీ ఆనంది భర్త మాత్రం ఆమెను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. సందేశాత్మక సినిమా అవ్వడం వల్లే మంగై సినిమాలో నటించానని చెబుతుంది ఆనంది. ఈ సినిమాతో కోలీవుడ్ లో ఆనందికి మళ్లీ సూపర్ క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.
Also Read : Raviteja : ఈగల్ వాయిదా.. ఆ డేట్ న సోలో రిలీజ్ ఛాన్స్..!