Kalki 2898 AD Trailer : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ వచ్చేసింది..
ప్రభాస్ హీరోగా నటిస్తున్న మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’ ట్రైలర్ వచ్చేసింది.
- Author : News Desk
Date : 10-06-2024 - 7:17 IST
Published By : Hashtagu Telugu Desk
Kalki 2898 AD Trailer : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. సి అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇండియన్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తుండడం గమనార్హం. ఇక దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా నటిసున్నారు. దీంతో ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది, ఎప్పుడు చూస్తామా.. అంటూ ప్రేక్షకులంతా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. ఈ నెల 27న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్.. నేడు సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే.. సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఆడియన్స్ ని థ్రిల్ చేయడం పక్కా అని తెలుస్తుంది.
కాగా ఈ ట్రైలర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్స్ లో ముందుగా ప్రీమియర్ వేశారు. దీంతో ఈ ట్రైలర్ ని బిగ్ స్క్రీన్ పై చూసి థ్రిల్ అయ్యేందుకు రెబల్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్దకి సందడి చేస్తున్నారు. ఇక రెబల్స్ జోష్ తో థియేటర్ వద్ద సినిమా రిలీజ్ వాతావరణం కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
#Kalki2898AD trailer celebrations at Vijayawada alankar 🔥🥳🥳#KalkiTrailerCelebrations #Prabhas #KalkiTrailer pic.twitter.com/TRo6r7IYha
— Prabhas Trends (@TrendsPrabhas) June 10, 2024
Sandhya 70 is all rebelified #kalki2898ad pic.twitter.com/0JyK3EUXwc
— VJ Vishnu ⛩️ (@EnduranceSpin) June 10, 2024