Ameesha Patel : తల్లి కాబోతున్న మహేష్ బాబు హీరోయిన్..? ఏంటి పెళ్లి కాకుండానే !!
Ameesha Patel : ఇందుకు కారణం ఆమె ఇటీవల దుబాయ్‌లో తీసుకున్న కొన్ని ఫోటోలు, వీడియోలే. అందులో ఆమె బొద్దుగా కనిపించడంతో, నెటిజన్లు ఆమె గర్భవతేనేమో అనే అనుమానాలకు తెరలేపాయి
- By Sudheer Published Date - 01:31 PM, Sun - 4 May 25

మహేష్ బాబు నటించిన “నాని” (Nani) సినిమాలో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన అమీషా పటేల్(Ameesha Patel )..తాజాగా తల్లి (Ameesha Patel Pregnant) కాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం ఆమె ఇటీవల దుబాయ్‌లో తీసుకున్న కొన్ని ఫోటోలు, వీడియోలే. అందులో ఆమె బొద్దుగా కనిపించడంతో, నెటిజన్లు ఆమె గర్భవతేనేమో అనే అనుమానాలకు తెరలేపాయి. ముఖ్యంగా ఆమె బికినీలో కనిపించిన ఓ వీడియోలో ‘బేబీ బంప్’ లాంటి ఆకృతి కనిపించిందంటూ ఓ వర్గం చెప్పుతోంది.
Vijayawada : రాసలీలలకు అడ్డాగా మారిన APTDC ఆఫీసు
ఇక మరో అనుమానానికి బలం ఇచ్చిన అంశం ఏమిటంటే, ఒక సందర్భంలో అమీషా డ్రింక్ చేయాలంటూ గ్లాసు ఎత్తగా అందులో వైన్ కాకుండా నీరు ఉండటం. ఇది గర్భిణులు సాధారణంగా పాటించే జాగ్రత్తల్లో ఒకటే కావడంతో, సోషల్ మీడియాలో ఆ వార్తలు మరింత బలం చేకూర్చేలా చేస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతుండగా, మరికొందరు ఆమె పెళ్లి కాకుండానే తల్లి అవుతుందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇప్పటివరకు అమీషా లేదా ఆమె దగ్గరివాళ్ల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.