Amala Paul : మొదటిసారి కొడుకు ఫేస్ చూపించిన అమలాపాల్.. ఓనమ్ స్పెషల్ ఫ్యామిలీ ఫొటోస్..
అమలాపాల్ తాజాగా మొదటిసారి తన కొడుకు ఫేస్ చూపించింది.
- By News Desk Published Date - 04:29 PM, Sun - 15 September 24
Amala Paul : గత సంవత్సరం వ్యాపారవేత్త జగత్ దేశాయ్ ని రెండో పెళ్లి చేసుకుంది అమలాపాల్. పెళ్లి అయిన కొన్ని రోజులకే ప్రగ్నెన్సీని ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇక ఇటీవల జూన్ నెలలో తనకు కి కొడుకు పుట్టాడు అని, అతనికి ఇలై అని పేరు పెట్టినట్టు అమలాపాల్ ప్రకటించింది. బేబీ బంప్ ఫొటోలు, కొడుకు పుట్టిన తర్వాత ఫేస్ కనపడకుండా పలు ఫొటోలు షేర్ చేసిన అమలాపాల్ తాజాగా మొదటిసారి తన కొడుకు ఫేస్ చూపించింది.
నేడు ఓనమ్ సందర్భంగా అమలాపాల్, తన భర్త జగత్ దేశాయ్, తన కొడుకు ఇలై కలిసి స్పెషల్ గా రెడీ అయి ఫ్యామిలీ ఫొటోలు దిగారు. ఈ ఫ్యామిలీ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అమలాపాల్. ఓ నదిలో బోట్ పై ఈ ఫొటోలు దిగినట్టు ఉన్నాయి. ఈ ఫోటోలను షేర్ చేస్తూ అమలాపాల్ ఓనమ్ శుభాకాంక్షలు తెలిపింది. మొదటిసారి కొడుకు ఫేస్ చూపించడంతో అమలాపాల్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఫ్యాన్స్, నెటిజన్లు ఈ జంటకు ఓనమ్ శుభాకాంక్షలు తెలుపుతూ అమలాపాల్ తనయుడు క్యూట్ గా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : RJ Shekar Basha : తండ్రి అయిన ఆర్జే శేఖర్ బాషా.. అందుకే బిగ్ బాస్ నుంచి పంపించేస్తున్నారా?