Allu Ayaan : అల్లు అయాన్ బర్త్ డే.. క్యూట్ వీడియో షేర్ చేసిన అల్లు స్నేహ రెడ్డి..
నేడు అల్లు అయాన్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
- By News Desk Published Date - 10:28 AM, Thu - 3 April 25

Allu Ayaan : అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ ఉంటుందని తెలిసిందే. పిల్లల ఫోటోలు, ఫ్యామిలీ వీడియోలు, ఫోటోలు రెగ్యులర్ గా షేర్ చేస్తుంది. అల్లు అయాన్ కి కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో అల్లు అర్జున్ తనయుడు అయాన్ క్యూట్ వీడియోలు బాగా వైరల్ అవ్వడంతో మోడల్ అయాన్ అని పేరు తెచ్చుకొని ఫేమస్ అయ్యాడు.
నేడు అల్లు అయాన్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో అల్లు స్నేహ రెడ్డి అల్లు అయాన్ పాత వీడియోలు, ఫోటోలు కలిపి ఒక క్యూట్ వీడియో తయారుచేసింది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అల్లు అయాన్ క్యూట్ వీడియో షేర్ చేసి.. మా చిన్ని ఫుడీకి హ్యాపీ బర్త్ డే. నెక్స్ట్ ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు డిన్నర్ టేబుల్ చుట్టూ మమ్మల్ని నవ్వించు. మా అందరికి నువ్వు ఒక మ్యాజిక్ లాంటివాడివి. గొప్ప కలలు కను. నిన్ను చూసి మేము గర్వపడుతున్నాము అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. దీంతో అల్లు స్నేహ పోస్ట్ వైరల్ గా మారింది. పలువురు ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు అయాన్ కి బర్త్ డే విషెస్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Nagababu : ఎమ్మెల్సీగా ప్రమాణం చేసాక మొదటిసారి పవన్ ని కలిసిన నాగబాబు.. ఫోటోలు వైరల్..