Allu Arjun-Trivikram Film : కొత్త సినిమా షూటింగ్ లో బిజీ కాబోతున్న బన్నీ
Allu Arjun-Trivikram Film : త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయనున్న మూవీ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం
- Author : Sudheer
Date : 19-01-2025 - 10:28 IST
Published By : Hashtagu Telugu Desk
పుష్ప 2 (Pushpa 2)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) కొత్త ప్రాజెక్టుపై దృష్టిసారించారు. త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో చేయనున్న మూవీ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. గతంలో వీరి కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో చిత్రాలు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాదు అల్లు అర్జున్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసాయి. దీంతో ఇప్పుడు మరోసారి వీరి కాంబో లో సినిమా అనగానే అంచనాలు మొదలయ్యాయి.
MLC Kavitha : పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం.. కానీ
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే… రామాయణంతో లింక్ ఉండేలా మైథలాజికల్ టచ్ ఉన్న కథను త్రివిక్రమ్ రాసుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కించనున్నారు. ఇందుకోసం కొందరు తెలుగు పండితులతో అల్లు అర్జున్ స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారట. అలాగే తన లుక్ మార్చుకోవడానికి కూడా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారట . ఇదిలా ఉంటె ఈ మూవీ కి అనిరుద్ మ్యూజిక్ అందిస్తాడని వినికిడి. త్వరలోనే సినిమాకు సంబంధించి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.