Operation Sindoor : అలియా భట్ ఎమోషనల్ పోస్ట్
Operation Sindoor : మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్‌లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు
- By Sudheer Published Date - 02:15 PM, Tue - 13 May 25

భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వార్ సందర్బంగా బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ (Alia Bhatt) భారత సైనికుల (Indian Army) సేవలను ప్రశంసిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ భావోద్వేగపూరిత పోస్టు షేర్ చేశారు. ఆమె పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుంది” అన్న ఆమె మాటలు అనేకమందిని ఆలోచించేలా చేశాయి.
Tariffs : అమెరికా వస్తువులపై భారత్ టారిఫ్‌లు..!
“గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది, ప్రతి వార్తా వెనుక, ప్రతి భోజన బల్ల చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైన్యం మేల్కొని, దేశకోసం మనకోసం యుద్ధం చేస్తున్నారు అనే బరువును మనం అనుభవించాం.
Counterfeit Medicine : మెడికల్ షాపుల్లో మందులు కొంటున్నారా?
మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్‌లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని తన తల్లికి తెలుస్తుంది” అంటూ అలియా తన ఇన్‌స్టా స్టోరీలో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. అలియా భట్ ఈ పోస్టు ద్వారా భారత సైనికుల పట్ల తన గౌరవాన్ని, ప్రేమను తెలియజేయడమే కాకుండా, వారి త్యాగానికి దేశం ఎంతటి రుణపడి ఉందో గుర్తుచేశారు. ఈమె మాటలు ఇప్పుడు దేశ ప్రజల మనసుల్లో జాతిప్రేమను మరింతగా రగిలించాయి.