HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Akshay Kumar Entered Into Manchu Vishnu Kannappa Movie Sets

Kannappa : కన్నప్ప సెట్స్ లోకి అడుగుపెట్టిన అక్షయ్ కుమార్..

కన్నప్ప సెట్స్ లోకి అడుగుపెట్టిన అక్షయ్ కుమార్. మొదటిసారి ఓ తెలుగు సినిమాలో నటించబోతున్న బాలీవుడ్ ఖిలాడీకి..

  • Author : News Desk Date : 16-04-2024 - 10:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akshay Kumar Entered Into Manchu Vishnu Kannappa Movie Sets
Akshay Kumar Entered Into Manchu Vishnu Kannappa Movie Sets

Kannappa : ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి శివ క్షేత్రం చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ ‘కన్నప్ప’. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. సౌత్ టు నార్త్ స్టార్ కాస్ట్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

ఇప్పటికే మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్, ప్రభాస్, ముఖేష్ రుషి, బ్రహ్మానందం, నయనతార, మధుబాల, ప్రీతీ ముకుందన్, భాస్కరన్ ఐశ్వర్య.. వంటి భారీ తారాగణం ఈ మూవీలో భాగమయ్యారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఈ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ కా ఖిలాడీ అక్షయ్ కుమార్.. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. ఇక ఈ పాత్రకి సంబంధించిన షూటింగ్ చేయడం కోసం అక్షయ్.. రీసెంట్ గా ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టారు.

అక్షయ్ కుమార్ నటిస్తున్న మొదటి తెలుగు మూవీ ఇది. ఇక మొదటిసారి ఓ తెలుగు సినిమాలో నటించబోతున్న బాలీవుడ్ ఖిలాడీకి కన్నప్ప టీం గ్రాండ్ గా వెల్కమ్ పలికింది. అందుకు సంబంధించిన వీడియోని మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

కాగా గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నప్ప స్టోరీతో ‘భక్త కన్నప్ప’ అనే సినిమాని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. అప్పటిలో ఆ సినిమా ప్రభంజనం సృష్టించింది. తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఆ తరువాత ఆ సినిమాని మళ్ళీ రీమేక్ చేద్దామని చాలామంది ట్రై చేసినా.. అది కార్యరూపం దాల్చలేదు. ఇన్నాళ్ల తరువాత మంచి విష్ణు ఆ కథని మళ్ళీ రీమేక్ చేస్తున్నారు. మరి భక్త కన్నప్పని ఈ కన్నప్ప మెప్పిస్తుందా లేదా చూడాలి.

Also read : Charlie Chaplin Birthday Today : మాట్లాడకుండా ..పొట్టచెక్కలు చేస్తాడు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akshay Kumar
  • Kannappa
  • manchu vishnu
  • prabhas

Related News

Prabhas New Look

ఇండియన్ సినీ చరిత్రలో ప్రభాస్ ఒక్కడికే ఆ రికార్డు దక్కింది

రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చాటారు. నిన్న రిలీజైన 'రాజాసాబ్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.112 కోట్లు రాబట్టింది. దీంతో భారత సినీ చరిత్రలో 6 చిత్రాలకు (బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి, రాజాసాబ్)

  • Raajasabh Pre Release

    ‘రాజాసాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

  • The Raja Saab Sequel

    ప్ర‌భాస్ రాజాసాబ్‌.. పార్ట్‌-2 పేరు ఇదేనా?!

  • Raajasaab Ticket Price

    ప్రభాస్ “రాజాసాబ్” ఫైనల్ టాక్

  • The Raja Saab

    ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!

Latest News

  • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

  • మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే!

  • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

  • రాత్రిపూట నిద్ర ప‌ట్ట‌డంలేదా.. అయితే కార‌ణాలీవే?!

  • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

Trending News

    • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

    • భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd