Akira Nandan : అకీరాను లాంచ్ చేసేది అన్నయ్యేనా..?
Akira Nandan : అకీరా గ్రాండ్ లాంచ్(Akira Grand Launch)కు ముందస్తు ప్రణాళిక అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి
- By Sudheer Published Date - 09:10 PM, Fri - 28 February 25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) సినిమా ఎంట్రీకి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అకీరాను పాన్-ఇండియా స్థాయిలో పరిచయం చేయడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి ఆశీర్వాదం తీసుకురావడం కూడా ఈ వ్యవహారానికి మరింత ఆసక్తిని పెంచింది. ఇది అకీరా గ్రాండ్ లాంచ్(Akira Grand Launch)కు ముందస్తు ప్రణాళిక అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..అకీరా లాంచింగ్ బాధ్యతలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తీసుకున్నారని సమాచారం. స్టోరీ ఎంపిక, దర్శకుడు సెట్ చేయడం మొదలైన పనులను రామ్ చరణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, చివరికి మెగాస్టార్ చిరంజీవి అంగీకారం తీసుకున్న తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ ముందుకు వెళతారని తెలిసింది. ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో పూర్తిగా నిమగ్నమైన పవన్ కళ్యాణ్ అకీరా సినీ కెరీర్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతున్నారని, అందుకే రామ్ చరణ్ ఈ బాధ్యతను స్వీకరించినట్లు తెలుస్తోంది.
Nominated Posts : నామినేటెడ్ పోస్టుల పై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అకీరా లాంచ్ విషయంలో రేణు దేశాయ్ (Renu Desai) కూడా ఆసక్తిగా వ్యవహరిస్తున్నారని, రామ్ చరణ్‌తో టచ్‌లో ఉండి అన్నివివరాలను తెలుసుకుంటున్నారని సమాచారం. మెగా ఫ్యామిలీ నుంచి అకీరా గ్రాండ్ ఎంట్రీ ఓ అద్భుతమైన ప్రాజెక్ట్‌గా నిలవబోతుందని, ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించేలా ప్లాన్ జరుగుతోందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తుండడంతో మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.