Keerti Suresh : 40 రోజుల వనవాసం పూర్తి చేసుకున్నా.. స్టార్ హీరోయిన్ పోస్ట్ పై ఆడియన్స్ షాక్..!
Keerti Suresh మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సీరీస్ లతో కూడా అలరిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అమ్మడు ఈమధ్య బాలీవుడ్
- Author : Ramesh
Date : 09-04-2024 - 7:13 IST
Published By : Hashtagu Telugu Desk
Keerti Suresh మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సీరీస్ లతో కూడా అలరిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అమ్మడు ఈమధ్య బాలీవుడ్ లో కూడా ఛాన్సులు అందుకుంటుంది. ఇదిలాఉంటే లేటెస్ట్ గా ఒక వెబ్ సీరీస్ కోసం ఏకంగా 40 రోజుల పాటు కేరళలోనే ఉండిపోయిందట కీర్తి సురేష్. ఆ అప్డేట్ నే ఇస్తూ 40 రోజుల వనవాసం తర్వాత ఇంటికి చేరుకున్నా.. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నానని రాసుకొచ్చింది.
ఇంతకీ కీర్తి సురేష్ ఈ 40 రోజులు ఏం చేసింది అంటే. రాధికా ఆప్టేతో కలిసి కీర్తి సురేష్ అక్కా అనే వెబ్ సీరీస్ లో నటిస్తుంది. ధనరాజ్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ కోసం కీర్తి సురేష్ 40 రోజుల పాటు కేరళలోనే ఉందట. ఆ షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన అమ్మడు తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసింది.
Also Read : Vijay Devarakonda Family Star : ఫ్యామిలీ స్టార్ కి కలిసి వచ్చిన ఉగాది.. రాజు గారు చెప్పింది ఇదే కదా..!
దసరా సినిమా తర్వాత తెలుగులో పెద్దగా ఆఫర్లు అందుకోని కీర్తి సురేష్ తమిళంలో మాత్రం వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది. అంతేకాదు అక్కడ లేడీ ఓరియెంటెడ్ కథలతో వస్తుంది కీర్తి సురేష్. రఘుతాత, రివాల్వర్ రీటా, కన్నివెడీ అనే సినిమాలతో తన సత్తా చాటేందుకు వస్తుంది అమ్మడు.
ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో తన మార్క్ చాటాలని చూస్తుంది అమ్మడు. కీర్తి సురేష్ చేస్తున్న ఈ క్రేజీ అటెంప్ట్స్ కు ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు 40 రోజుల తర్వాత ఆమె నుంచి వచ్చిన ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు.