Adipurush Song: ఆదిపురుష్ నుంచి జైశ్రీరామ్ సాంగ్ రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
తాజాగా ఆదిపురుష్ చిత్రబృందం జైశ్రీరామ్ అనే ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
- By Balu J Published Date - 05:22 PM, Sat - 20 May 23

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ (Prabhas), బాలీవుడ్ బ్యూటీ క్రుతి సనన్ కాంబినేషన్ లో ఆదిపురుష్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. దానికి తోడు మేకర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లు ప్రకటిస్తూ ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ఇక తాజాగా చిత్రబృందం ఈ సినిమాలోని జైశ్రీరామ్ ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో కొన్ని సీన్లు, మరికొన్ని కొత్త షాట్స్ ఈ పాటలో యాడ్ చేశారు.
ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొరుచుకుంటున్నాయి. ఈ పాటతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా అనిపిస్తుంది. అజయ్-అతుల్ స్వర పరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించాడు. జై శ్రీరామ్ పాట సినీ ప్రేక్షకులతో పాటు హనుమాన్ భక్తులు బాగుందంటూ కనెక్ట్ అవుతున్నారు. టీజర్ (Teaser) తో వచ్చిన నెగెటివిటీతో కాస్త డల్ అయిన ఆదిపురుష్ యూనిట్ కి ట్రైలర్, జై శ్రీరామ్ సాంగ్ బిట్ హిట్ అవ్వడం మంచి బూస్టప్ ఇచ్చింది.
ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ టీజర్ మీద నుంచి వచ్చిన నెగెటివిటీ కాస్త ఈ సాంగ్ తో కొట్టుకుపోయిందనే చెప్పాలి. ఈ సాంగ్ తో పాటు ట్రైలర్ కూడా సినిమా మీదున్న ట్రోలింగ్ ని తగ్గించింది. ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా 600కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ జూన్ 16నే రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ మూవీపై (Adipurush) టాలీవుడ్ తో పాట బాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: TTD Temple: మరో తిరుమలగా కరీంనగర్, 40 కోట్లతో టీటీడీ ఆలయ నిర్మాణం!
Related News

Mega Update: భోళా మేనియా త్వరలో ప్రారంభం.. మాస్ స్టెప్పులకు మెగాస్టార్ రెడీ!
ఇప్పటికే వాల్తేరు వీరయ్యతో ఆకట్టుకున్న మెగా స్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ తో మన ముందుకు రాబోతున్నాడు.