Surabhi Santhosh Wedding : సైలెంట్ గా పెళ్లి చేసుకున్న నటి సురభి..
బాలీవుడ్ సింగర్ ప్రణవ్ చంద్రన్ ను ఈమె వివాహం చేసుకుంది
- Author : Sudheer
Date : 25-03-2024 - 9:57 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల చిత్రసీమలో వరుసగా పెళ్లి పెళ్లి భాజాలు మోగుతున్నాయి. వరుసపెట్టి హీరోలు , హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కుతూ తమ బ్యాచ్లర్ లైఫ్ కు శుభం కార్డు పలుకుతున్నారు. తాజాగా మలయాళ నటి సురభి సంతోష్ (Surabhi Santhosh ) సైలెంటుగా పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది. బాలీవుడ్ సింగర్ ప్రణవ్ చంద్రన్ ను ఈమె వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి సంబదించిన పిక్స్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సరిగమ లేబుల్ ఆర్టిస్ట్ అయిన ప్రణవ్ ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ…అతని స్వస్థలం మాత్రం కేరళలోని పయ్యన్నూరు.
We’re now on WhatsApp. Click to Join.
ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గత నవంబర్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇక సురభి కేవలం నటిగానే కాకుండా మోడల్, క్లాసికల్ డ్యాన్సర్ అలాగే లాయర్ కూడా. 2018లో విడుదలైన కుంచాకో బోబన్ ‘కుట్టనాదన్ మార్పాప’తో సురభి సినీ రంగ ప్రవేశం చేసింది. హీరోయిన్ చెల్లెలి పాత్రలో ఈమె కనిపించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన సురభి.. చివరగా ధ్యాన్ శ్రీనివాసన్ సరసన ‘ఆప్ కైసా హో’ చిత్రంలో నటించింది.
Read Also : CM Revanth Reddy Holi Celebrations : మనవడితో కలిసి హోలీ ఆడుకున్న సీఎం రేవంత్ రెడ్డి