Prabhas Heroine : మళ్లీ తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్
Prabhas Heroine : సినిమాల నుంచి కొంతకాలంగా గ్యాప్ తీసుకున్నప్పటికీ, సంజనా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్డేట్స్‌ను తరచుగా అభిమానులతో పంచుకుంటున్నారు
- By Sudheer Published Date - 12:25 PM, Thu - 3 April 25

తెలుగు సినీ ప్రేమికులకు సుపరిచితమైన నటి సంజనా గల్రానీ (Sanjjanaa Galrani) మళ్లీ తల్లి (2nd Pregnancy) కాబోతున్నారు. ‘బుజ్జిగాడు’(Bujjigadu) సినిమాతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ అందాల నటి, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చీరకట్టులో బేబీ బంప్తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. కుటుంబంతో కలిసి ప్రత్యేకంగా ఫొటోలు దిగిన ఆమె, తన మొదటి కుమారుడితో కలిసి ఉన్న క్యూట్ ముమెంట్స్‌ను కూడా పంచుకున్నారు.
Paritala Sunitha: నా భర్త హత్యలో జగన్ పాత్ర ఉంది.. పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు.
సంజనా 2021లో అజీజ్ పాషాను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ, తన వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగులో ‘సోగ్గాడు’, ‘పోలీస్ పోలీస్’, ‘ముగ్గురు’ వంటి చిత్రాల్లో నటించిన ఆమె, కన్నడ చిత్రసీమలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రెండోసారి తల్లిగా మారబోతున్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, భర్త, కుమారుడితో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేయడం అభిమానులను ఆనందానికి గురి చేసింది.
KKR vs SRH: నేడు కోల్‌కతా వర్సెస్ సన్‌రైజర్స్.. SRH ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పు!
సినిమాల నుంచి కొంతకాలంగా గ్యాప్ తీసుకున్నప్పటికీ, సంజనా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్డేట్స్‌ను తరచుగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈసారి కూడా తాను మళ్లీ తల్లి కాబోతున్న విషయాన్ని ఆనందంగా తెలియజేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె కుటుంబం మరింత ఆనందంగా ఉండాలని, కొత్తగా వచ్చే బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.