Actress Pragathi: ఫలించిన ప్రగతి కష్టం.. పవర్ లిఫ్టింగ్ లో కాంస్యం
ఏదో సరదా కోసం ఆమె ఈ వీడియోలను పోస్ట్ చేస్తుందనుకున్నారు. కానీ.. కొన్ని నెలల క్రితమే ప్రొఫెషనల్ ఆమె పవర్ లిఫ్టర్ గా మారి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా..
- Author : News Desk
Date : 29-11-2023 - 4:54 IST
Published By : Hashtagu Telugu Desk
Actress Pragathi: టాలీవుడ్ నటీమణుల్లో ఎప్పుడూ ఫిట్ గా ఉంటూ.. తన జిమ్, వర్కవుట్స్ వీడియోలను నెటిజన్లతో పంచుకునే నటి ప్రగతి కష్టం ఫలించిందిం. తల్లి, వదిన, అక్క, పిన్ని వంటి క్యారెక్టర్లలో ఒదిగిపోయే ప్రగతికి.. నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉంది. కరోనా టైమ్ నుంచి వర్కవుట్ వీడియోలను, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలను ఫ్యాన్స్ తో పంచుకుంటూనే సినిమాల్లో బిజీగా ఉండేది.
ఏదో సరదా కోసం ఆమె ఈ వీడియోలను పోస్ట్ చేస్తుందనుకున్నారు. కానీ.. కొన్ని నెలల క్రితమే ప్రొఫెషనల్ ఆమె పవర్ లిఫ్టర్ గా మారి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో సత్తా చాటారు. బెంగళూరులో ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా జరిగిన 28వ పురుషులు, మహిళల నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఈ సీనియర్ నటి 3వ స్థానంలో నిలిచి కాంస్యపతకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసుకున్న ప్రగతి.. కాస్త ఎమోషనల్ అయ్యారు.
“నా లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. హార్ట్ బ్రేక్స్, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో జీవితం ముగిసిపోయిందని చాలాసార్లు అనుకున్నాను. కానీ.. పవర్ లిఫ్టింగ్ జర్నీ నాకు ఒక కొత్త ఉత్సాహాన్నిచ్చింది. జీవితంపై ఆశలు పెంచింది. ఎన్ని కష్టాలొచ్చినా పోరాడాలనేదే జీవితానికి విజయమంత్రం” అని తన ఆనందాన్ని నెటిజన్లతో పంచుకున్నారు ప్రగతి. పవర్ లిఫ్టింగ్ లో కాంస్యం గెలిచిన ఆమెకు.. తోటి నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
https://www.instagram.com/reel/C0JGs6wKo_r/?utm_source=ig_web_copy_link