Adipurush Ravan: రావణుడు ఎన్టీఆర్, ఎస్వీఆర్ లా ఉంటాడు.. ఓంరౌత్ పై కేజీఎఫ్ నటి కామెంట్స్!
ప్రభాస్, సైఫ్ అలీఖాన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి.
- By Balu J Published Date - 03:17 PM, Tue - 4 October 22
ప్రభాస్, సైఫ్ అలీఖాన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి. విజువల్ ఎఫెక్ట్స్ మేకర్స్ పై భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఆ నేేపథ్యంలో రాజకీయ నాయకురాలు, కేజీ ఎఫ్ నటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ఆదిపురుష్’ భారతీయ పౌరాణిక ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా తెరకెక్కింది. ప్రభాస్ రాముడిగా, సైఫ్ రావణుడు, కృతి సనన్ సీతగా నటించారు.
రామాయణాన్ని తప్పుగా చూపించారంటూ (కేజీఎఫ్ ఫేం) మాళవిక అవినాష్ ‘ఆదిపురుష్’ దర్శక నిర్మాతలపై మండిపడ్డారు. సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రను చిత్రీకరించిన విధానాన్ని ఆమె ప్రత్యేకంగా నొక్కి చెప్పింది. వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, తులసీదాసు రామాయణం ఇలా అనేక రామాయణ గురించి తెలియజేస్తూ డైరెక్టర్ ఓంరౌత్ పై మండిపడింది. కన్నడ సినిమాలు, తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు రావణుడు ఎలా ఉంటాడో స్పష్టంగా చూపించాయని కామెంట్స్ చేసింది.
రావణుడు ఎలా ఉన్నాడో అర్థం చేసుకోవడానికి ‘భూకైలాస’లో ఎన్టీఆర్, ‘సంపూర్ణ రామాయణం’లో ఎస్వి రంగారావు లాంటివాళ్లను చూస్తే చాలు అని అన్నారు. నీలి కళ్ల అలంకరణతో, లెదర్ జాకెట్లు ధరించి ఉన్న వ్యక్తి ఎలా రావణుడు అవుతాడని ఈ నటి ప్రశ్నించింది. రామాయణం ఈ దేశాన్ని, దాని నాగరికతను ప్రజలను సూచిస్తుంది. కాబట్టి సినిమా దర్శకుడు అలాంటి చారిత్రత్మకమైన ప్రాతలపై ఫోకస్ చేయాలి” అని తన ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆదిపురుష్ ట్రోల్స్ తో పాటు ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.
Ravana,a Shiva-Bhakta Brahmin from Lanka had mastered the 64 arts!Jaya(Vijay) who was guarding Vaikunta descended as Ravana owing to a curse!
This may be a Turkish tyrant but is not Ravana!
Bollywood,Stop misrepresenting our Ramayana/History!Ever heard of the legend NTRamaRao? pic.twitter.com/tGaRrsSQJW— Malavika Avinash (@MalavikaBJP) October 3, 2022
Related News
AP Politics: చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే
AP Politics: గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 22వరోజుకు చేరుకుంది. ప్రజలతో కలిసి ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరించారు. రాబోయే ఐదేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానీకానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ