Meena Husband & Pigeons: ఆ పావురాల వల్లే హీరోయిన్ మీనా భర్త మృతి చెందారా?
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన మీనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆమె భర్త విద్యాసాగర్ మరణించారు.
- By Hashtag U Published Date - 09:52 AM, Wed - 29 June 22
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన మీనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆమె భర్త విద్యాసాగర్ మరణించారు. కొవిడ్ వచ్చిన తరువాత కొన్ని ఆరోగ్య సమస్యలు ఆయనను తీవ్ర అనారోగ్యానికి గురిచేశాయి. దీంతో ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయి. అయితే ఆయన లంగ్స్ కు ఈ పరిస్థితి రావడానికి పావురాలే కారణమంటోంది తమిళ మీడియా. దీంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు.
మీనా ఇంటికి దగ్గరలో చాలా పావురాలు ఉంటాయి. చూడడానికి అవి అందంగా ఉండడంతో వాటిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ పావురాలు వదిలిన వ్యర్థాల వల్ల అక్కడి చుట్టుపక్కల గాలి కలుషితమవుతోంది. మీనా ఇంట్లో ఉన్నవారంతా ఆ కలుషిత గాలినే పీల్చడం వల్ల ఇంట్లో అందరి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకింది. కానీ ఆమె భర్త విద్యాసాగర్ కు కొవిడ్ కూడా సోకడం వల్ల ఆయనఊపిరితిత్తుల పరిస్థితి దారుణంగా తయారైంది.
మీనా భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయి. దీంతో ఆ లంగ్స్ ను మార్చడానికి ఆసుపత్రి వైద్యులు తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ ఆర్గాన్ డోనార్ సరైన సమయానికి దొరకకపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో మీనా భర్త ప్రాణాలు కోల్పోయారు. నిజానికి పావురాల వ్యర్థాలకు ప్రాణాలు తీసేంత శక్తి ఉందా అంటే ఉందనే చెబుతోంది.. విద్యాసాగర్ మరణం.
పావురాలకు సోకే సిర్కో వైరస్ వల్ల అవి విడిచిపెట్టిన వ్యర్థాల్లో విషపూరితమైన పదార్థాలు ఉంటాయని.. అవి గాలిలో కలిసిన తరువాత ఆ గాలినే పీలిస్తే.. అది ఊపిరిత్తులపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఇప్పుడు మీనా ఇంట్లో కూడా అందరూ లంగ్ ఇన్ఫెక్షన్ కు గురవ్వడానికి కారణం.. ఈ పావురాలే అన్న వాదనుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Related News
Actress Meena: రెండో పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేసిన మీనా.. సెన్సేషన్ కావడానికి ఊరికే రాసేస్తారా అంటూ?
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె రెండు తరాల ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మీనా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.. అంతేకాకుండా దృశ్యం వంటి సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం కేవలం నటనకు ప్రాధాన్యం ఉన�