Ravindar Chandrasekaran: ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న రవీంద్ర చంద్రశేఖర్
సౌత్ స్టార్ కపుల్స్‌లో ఎంతో పేరు తెచ్చుకున్న రవీంద్ర చంద్రశేఖర్, మహాలక్ష్మిల గురించి తెలియని వారు ఉండరు. తమిళ నిర్మాతగా రవీందర్ చంద్రశేఖర్ పాపులర్ అయినప్పటికీ టీవీ నటి మహాలక్ష్మిని పెళ్లి
- Author : Praveen Aluthuru
Date : 11-01-2024 - 1:33 IST
Published By : Hashtagu Telugu Desk
Ravindar Chandrasekaran: సౌత్ స్టార్ కపుల్స్‌లో ఎంతో పేరు తెచ్చుకున్న రవీంద్ర చంద్రశేఖర్, మహాలక్ష్మిల గురించి తెలియని వారు ఉండరు. తమిళ నిర్మాతగా రవీందర్ చంద్రశేఖర్ పాపులర్ అయినప్పటికీ టీవీ నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఈ కపుల్స్ నిత్యం వార్తలు నిలుస్తున్నారు. మహాలక్ష్మి రవీంద్రను డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. రవీందర్‌ను బాడీ షేమింగ్ చేశారు. అయితే అవేం పట్టించుకోకుండా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఓ ఫ్రాడ్ కేసులో రవీందర్ చంద్రశేఖర్ అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యాడు.
రవీందర్ చంద్రశేఖరన్ తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన పలు సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ప్రముఖ నిర్మాతగా ఎదిగారు. రవీందర్ చంద్రశేఖరన్- మహాలక్ష్మి వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఇద్దిరికీ ఇది రెండో పెళ్లి. మహాలక్ష్మికి అప్పటికే పిల్లలు కూడా ఉన్నారు.అయితే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె నిర్మాత రవీంద్ర చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకుంది. ఇద్దరు అన్యోన్యంగా సంసారం చేస్తున్నప్పటికీ ఓ దశలో ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని తేలింది.
రవీందర్ తాజాగా అనారోగ్యానికి గురయ్యారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. దీంతో ఆయన్ని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది. ఆ ఫొటోలో రవీందర్ ముక్కుకు ఆక్సిజన్ మాస్కుతో ఉన్నాడు. ఆ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Makar Sankranti : సంక్రాంతి రోజున ఇవి తింటేనే పండగ..