Anasuya : కొత్తింట్లోకి అనసూయ.. గ్రాండ్ గా గృహప్రవేశం.. ఇంటికి ఏమని పేరు పెట్టిందో తెలుసా?
అనసూయ తన ఫ్యామిలితో కలిసి గృహప్రవేశ వేడుక ఘనంగా చేసుకున్నారు.
- By News Desk Published Date - 08:12 AM, Tue - 13 May 25

Anasuya : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ ఇప్పుడు నటిగా దూసుకుపోతుంది. ఓ పక్క నటిగా వరుస సినిమాలు చేస్తూనే మరో పక్క పలు టీవీ షోలలో కూడా పాల్గొంటుంది. అనసూయ తాజాగా కొత్త ఇల్లు కొనుక్కుంది. నిన్న కొత్తింట్లోకి అడుపెట్టారు. అనసూయ తన ఫ్యామిలితో కలిసి గృహప్రవేశ వేడుక ఘనంగా చేసుకున్నారు.
అనసూయ తన సోషల్ మీడియాలో కొత్త ఇంటి గృహప్రవేశ వేడుక ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ సీతారామ ఆంజనేయ కృపతో, మా తల్లితండ్రుల ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో మా జీవితంలోని మరో అధ్యాయం. మా కొత్తింటి పేరు శ్రీరామ సంజీవని. జై శ్రీరామ్.. జై హనుమాన్ అంటూ రాసుకొచ్చింది.
దీంతో అనసూయ తన డ్రీం హౌస్ కట్టుకుందని, ఆ ఇంటికి శ్రీరామ సంజీవని అని పేరు పెట్టుకుందని తెలుస్తుంది. ఇక ఈ ఫొటోల్లో అనసూయతో పాటు తన భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పలువురు సెలబ్రిటీలు, అనసూయ ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీరు కూడా అనసూయ గృహ ప్రవేశం ఫోటోలు చూసేయండి..
Also Read : NTR – Ram Charan : ఎన్టీఆర్-చరణ్ ల స్నేహానికి విలువ కట్టలేనిది..సాక్ష్యం ఇదే !!