NTR – Ram Charan : ఎన్టీఆర్-చరణ్ ల స్నేహానికి విలువ కట్టలేనిది..సాక్ష్యం ఇదే !!
NTR - Ram Charan : చరణ్ తారక్ పుట్టినరోజు సందర్భంగా "అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే" (NTR Birthday) చెబుతూ ఆలింగనం చేయడం, ముద్దుపెట్టడం ప్రేక్షకుల మనసులను హత్తుకుంది
- By Sudheer Published Date - 12:42 PM, Mon - 12 May 25

లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ఆర్ఆర్ఆర్ లైవ్ కన్సర్ట్ (RRR Live Concert) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో ఆ ప్రాంగణం ఒక వేడుక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మారింది ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ (NTR & Ram Charan) ఇద్దరూ కలిసి స్టేజ్ పై దర్శనం ఇవ్వడం. చాలా కాలంగా ఒకే వేదికపై కనిపించని ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కనిపించడంతో అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది. వారు చేతులు పట్టుకొని స్టేజీపైకి రావడం, ఆత్మీయంగా మాట్లాడటం చూసిన ప్రతీ ఒక్కరూ వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
Hyderabad : హైదరాబాద్ లో రూ.50 లక్షలకే ఆపార్టుమెంట్..ఎక్కడో తెలుసా..?
చరణ్ తారక్ పుట్టినరోజు సందర్భంగా “అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే” (NTR Birthday) చెబుతూ ఆలింగనం చేయడం, ముద్దుపెట్టడం ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “తనకు దొరికిన గొప్ప స్నేహితుడితో కలిసి ఆర్ఆర్ఆర్ లో నటించడం జీవితాంతం మరిచిపోలేని అనుభూతి” అని చెప్పాడు. అలాగే “నాటు నాటు” పాటలో చిరంజీవి, బాలకృష్ణలు కలిసి డాన్స్ చేసినట్లుగా అనిపించిందని చెప్పడంలో ఆయన గౌరవ భావనను వ్యక్తం చేశారు. బాలయ్య పేరు తారక్ నోట వినడమే అభిమానులకి సర్‌ప్రైజ్ గా మారింది.
ఇక ఈ ఈవెంట్‌లో కీరవాణి లైవ్ ఆర్కెస్ట్రా కూడా ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతిని కలిగించింది. థియేటర్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారంతా సెల్‌ఫోన్‌ల ద్వారా వీడియోలు తీసి షేర్ చేయడంతో, లైవ్ స్ట్రీమింగ్ లేకున్నా ఈ వేడుక సానుభూతులను ప్రపంచానికి చేరవేసింది. మహేష్ బాబు కూడా ఈ ఈవెంట్‌కి వస్తారని ప్రచారం జరిగినా, చివరివేళలో రాకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఒక్కసారి తారక్, చరణ్, మహేష్ ఒకే వేదికపై కనిపించినట్లయితే తెలుగు సినీ అభిమానులకు అది చిరస్మరణీయ ఘట్టంగా ఉండేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Happy Birthday NTR – Ram Charan 👏👌 pic.twitter.com/x7jTfkqD2P
— CHITRAMBHALARE (@chitrambhalareI) May 12, 2025