Thrigun Wedding : సైలెంట్ గా నిశ్చితార్థం చేసేసుకున్న యువ నటుడు.. రేపే పెళ్లి..
ఇటీవల ఎవరికి తెలియకుండా సైలెంట్ గా నిశ్చితార్థం(Engagement) చేసుకున్నాడు త్రిగుణ్. నివేదిత(Niveditha) అనే అమ్మాయిని త్రిగుణ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.
- By News Desk Published Date - 10:00 PM, Sat - 2 September 23

నటుడు అదిత్ అరుణ్(Adith Arun) తెలుగు, తమిళ్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవల కొన్నాళ్ల క్రితం తన పేరుని త్రిగుణ్(Thrigun) గా మార్చుకున్నట్టు ప్రకటించాడు. త్రిగుణ్ తెలుగులో డియర్ మేఘ, ప్రేమదేశం, 24 కిసెస్, WWW.. లాంటి పలు సినిమాలతో మెప్పించాడు. త్వరలో మరిన్ని సినిమాలతో రానున్నాడు త్రిగుణ్.
ఇటీవల ఎవరికి తెలియకుండా సైలెంట్ గా నిశ్చితార్థం(Engagement) చేసుకున్నాడు త్రిగుణ్. నివేదిత(Niveditha) అనే అమ్మాయిని త్రిగుణ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఇక పెళ్లి(Marriage) రేపు సెప్టెంబర్ 3న జరగనుంది. తమిళనాడు తిరుపూర్ లోని ఓ కల్యాణమండపంలో త్రిగుణ్-నివేదితల వివాహం జరగనుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : Kushi Box Office: ఖుషికి భారీ ఓపెన్సింగ్స్, మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే!